For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మధుర ఘట్టాలకు సాక్షిగా ధోని: సచిన్ గెలిపిస్తే, కోహ్లీ టైగా ముగించాడు

MS Dhoni witness indian cricket greatest moments

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అంతేకాదు వన్డేల్లో పది వేల పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా మొత్తంగా 13వ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

తనకు అచ్చొచ్చిన ఈ మైదానంలోనే తన క్రికెట్ కెరీర్‌లోనే చిర్మస్మరణీయమైన పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మరో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. గతంలో ఈ స్టేడియంలో 118, 117, 99, 65 పరుగుల ఇన్నింగ్స్‌లతో మెరిసిన కోహ్లీ.. బుధవారం 157 నాటౌట్‌ పరుగులతో సత్తాచాటాడు.

కోహ్లీకి ఇది 37వ సెంచరీ

కోహ్లీకి ఇది 37వ సెంచరీ

తాజా సెంచరీ కోహ్లీకి ఇది 37వ సెంచరీ కావడం విశేషం. ఈ సిరిస్‌లో ఇది రెండోది కావడం గమనార్హం. విశాఖ స్టేడియంలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడో సెంచరీలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్‌లోని మిర్‌పూర్‌లో కోహ్లీ 13 ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు బాదిన కోహ్లీ ఆ తర్వాత విశాఖలోనే ఎక్కువ సెంచరీలు సాధించాడు. అంతేకాదు ఈ స్టేడియంలో మొత్తం 5 వన్డేలాడిన కోహ్లీ 139 సగటుతో 556 పరుగులు రాబట్టాడు.

ఆష్లే నర్స్‌ బౌలింగ్‌లో మూడో బంతిని లాంగాన్‌ దిశగా

ఆష్లే నర్స్‌ బౌలింగ్‌లో మూడో బంతిని లాంగాన్‌ దిశగా

ఆష్లే నర్స్‌ బౌలింగ్‌లో 37వ ఓవర్‌ మూడో బంతిని లాంగాన్‌ దిశగా పంపి సింగిల్‌ (81వ పరుగు) తీయడంతో ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ సమయంలో నాన్‌ స్ట్రైకింగ్‌లో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అతడి వద్దకు వచ్చి అభినందించగా కోహ్లీ బిగ్గరగా నవ్వాడు. అయితే, ఇక్కడ విశేషం ఏంటంటే భారత క్రికెట్‌లో మధుర ఘట్టాలుగా నిలిచే సందర్భాలన్నింటిలో ధోని సాక్షిగా నిలిచాడు.

 యువరాజ్‌ సింగ్‌ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టినపుడు

యువరాజ్‌ సింగ్‌ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టినపుడు

2007 టి20 వరల్డ్ కప్‌లో వెటరన్ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టినపుడు, 2010లో సచిన్‌ వన్డేల్లో తొలి డబుల్‌ సెంచరీని సాధించినపుడు, రోహిత్‌ శర్మ వన్డేల్లో తన తొలి డబుల్ సెంచరీని అందుకున్నప్పుడు... నాన్‌ స్ట్రయికర్‌గా ధోనినే ఉండటం విశేషం. వీటితో పాటు 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోని స్ట్రయికింగ్‌లో ఉండి సిక్స్‌తో దేశాన్ని విశ్వ విజేతగా నిలపడం భారత క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తే.

ఎలైట్ జాబితాలోకి విరాట్ కోహ్లీ

ఎలైట్ జాబితాలోకి విరాట్ కోహ్లీ

ఇదిలా ఉంటే, భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్రసింగ్ ధోనీ (10,126) మాత్రమే ఈ రికార్డుని అందుకున్నారు. తాజాగా విశాఖ వన్డేలో సెంచరీతో కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ జాబితాలో చేరాడు. కాగా, వన్డేల్లో అందరికంటే ముందుగా 10వేల పరుగుల మైలు రాయిని అందుకున్న క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ చరిత్ర సృష్టించాడు.

టైగా ముగిసిన విశాఖపట్నం మ్యాచ్

టైగా ముగిసిన విశాఖపట్నం మ్యాచ్

మార్చి 31, 2001న ఇండోర్‌లో ఆస్ట్రేలియాపై సచిన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 118 పరుగుల భారీ తేడాతో గెలిచింది. సచిన్‌ 125 బంతుల్లో 19 ఫోర్లతో 139 పరుగులు చేసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు. ఇది సచిన్‌ కెరీర్‌లో 28వ సెంచరీ. ఇక, విరాట్ కోహ్లీ వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న విశాఖపట్నం మ్యాచ్‌లో టీమిండియా గెలవలేదు. అలాగని ఓడనూ లేదు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ టైగా ముగిసింది.

Story first published: Thursday, October 25, 2018, 12:38 [IST]
Other articles published on Oct 25, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+