ధోనీ ఖాతాలో మరో టైటిల్.. ఈ సారి క్రికెట్‌లో కాదు!!

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటుకు కాస్త విరామం ఇచ్చి రాకెట్ పట్టాడు. క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించిన ధోనీ.. టెన్నీస్‌లోనూ సత్తా చాటాడు. రాంచీలోని జేఎస్‌సీఏ కంట్రీ క్రికెట్ క్లబ్ టెన్నిస్ టోర్నమెంట్ ధోనీ విజయం సాధించి.. టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం ధోని టెన్నిస్ కోర్టులో రాకెట్ పట్టుకుని ఆడుతున్నప్పటి ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

6-3, 6-3 తేడాతో విజయం సాధించి
రాంచీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సరదాగా టెన్నిస్ ఆడుతూ అతను కనిపించాడు. అయితే రాంచీలోని జేఎస్‌సీఏ కంట్రీ క్రికెట్ క్లబ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్న ధోని తనలోని మరోకోణాన్ని బయటపెట్టాడు. పురుషుల డబుల్స్ విభాగంలో స్థానిక టెన్నిస్ క్రీడాకారుడు సుమిత్ కుమార్‌తో కలిసి ఆడాడు. ధోనీ స్థానిక టెన్నిస్ ప్లేయర్‌తో కలిసి ఆడిన ధోనీ ఫైనల్ మ్యాచ్‌లో 6-3, 6-3 తేడాతో విజయం సాధించి.. అందరిని ఆశ్చర్యపరిచాడు.

ఏ ఆట ఆడినా.. ధోని ఎక్కడైనా రాజే
ఇలా ధోని టెన్నిస్‌లో తన ప్రావీణ్యం చూపించడంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మిస్టర్ కూల్‌కు అన్ని క్రీడల్లోనూ మంచి ప్రవేశం ఉందంటూ కితాబిస్తున్నారు. ‘ధోని కొత్త అవతారం ఎత్తాడు' అని, ‘ఏ ఆట ఆడినా.. ధోని ఎక్కడైనా రాజే' అని, జాతీయ, అంతర్జాతీయ టెన్నిస్ పోటీల్లో ధోనికి కూడా స్థానం కల్పించవచ్చు' అని కామెంట్లు పెడుతున్నారు.

ఫామ్ లేమి కారణంగా జట్టులో చోటు కోల్పోయి
టీమిండియా కెప్టెన్‌గా, క్రికెటర్‌గా మహేంద్రసింగ్ ధోనీ ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం మాత్రం ధోనీ తన ఫామ్ లేమి కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో సొంతగడ్డపై టీమిండియా విండీస్‌తో ఆడిన టీ20 సిరీస్‌లో, ఆస్ట్రేలియా పర్యటనలో ధోనీకి జట్టులో చోటు కల్పించలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications