ఫంత్, శాంసన్ ప్రదర్శనపై ధోని ఓపిగ్గా: ఐపీఎల్ తర్వాత అంటూ బాంబు పేల్చిన లక్ష్మణ్

హైదరాబాద్: యువ వికెట్ కీపర్లు రిషబ్ పంత్, సంజూ శాంసన్‌లకు సెలక్టర్లు ఇస్తోన్న అవకాశాలను ఉపయోగించుకోలేకపోతే సమీప భవిష్యత్తులో ధోని జట్టులోకి తిరిగొస్తాడని భారత మాజీ బ్యాట్స్‌మన్ వివిఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ 2020 తర్వాత ధోని తన అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకుంటాడని లక్ష్మణ్ పేర్కొన్నారు.
తాజాగా, స్టార్స్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ "రిషబ్ పంత్, సంజూ శాంసన్‌ల ప్రదర్శనను చూడటానికి ధోని ఓపికతో వేచి చూస్తున్నాడని నా అభిప్రాయం. తనకు అవకాశం వచ్చినప్పుడు ఐపీఎల్ తరువాత తప్పక ఓ నిర్ణయం తీసుకుంటాడు. ధోని ఐపీఎల్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. సీఎస్‌కేకు ధోని ఎప్పుడు ఆడినా మంచి ప్రదర్శనే చేశాడు" అని చెప్పారు.

సద్వినియోగం చేసుకోలేకపోతే
"యువ ఆటగాళ్లు ఇద్దరూ తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతే, ఐపీఎల్ ప్రదర్శనతో ధోని టీ20 వరల్డ్‌కప్‌లో తిరిగి చోటు దక్కించుకోవచ్చు. ప్రస్తుతం రిషబ్ పంత్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు. అతడికి బ్యాకప్ కీపర్‌గా సంజూ శాంసన్.. వీరిద్దరూ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతే మనం ధోనీని చూడొచ్చు. ధోని ఐపీఎల్‌లో ఎలా రాణిస్తాడో గుర్తుంచుకోండి" అని లక్ష్మణ్ వెల్లడించారు.

రిటైర్మెంట్‌పై స్పందించిన ధోని
కాగా, ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్ అనంతరం తాత్కాలిక విరామం తీసుకున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎట్టకేలకు తన రిటైర్మెంట్‌పై స్పందించాడు. పునరాగమనం గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ...'జనవరి వరకు నన్ను ఏం అడగొద్దు' అని స్పష్టంగా చెప్పాడు. దీంతో జనవరి వరకు ధోనీ రిటైర్మెంట్ ఊహాగానాలకు తెరపడినట్టే.

భారత ఆర్మీకి సేవలందించేందుకు
ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత తొలుత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోని విండిస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. నవంబర్ 3 నుంచి బంగ్లాతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కూడా ధోనీకి చోటు దక్కలేదు.

విండిస్ పర్యటనకు ఎంపికయ్యే అవకాశం!
వెస్టిండిస్‌తో ధోని పూర్తి ఫిట్‌నెస్‌తో సెలక్షన్ కమిటీకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ అందుకోవడానికి జార్ఖండ్ అండర్-23 జట్టుతో కలిసి ధోని ప్రాక్టీస్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్ పర్యటన ముగిసిన తర్వాత భారత్ పర్యటనకు వెస్టిండిస్ జట్టు రానుంది. ఈ నేపథ్యంలో ధోని వెస్టిండిస్ పర్యటనకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications