లేటెస్ట్ అప్‌డేట్.. ఎంఎస్ ధోనీ ఎప్పటివరకు ఆడతాడో తెలుసా?!!

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. అప్పటినుంచి మహీ మళ్లీ మైదానంలో కనిపించలేదు. ఇక మెగాటోర్నీ ప్రపంచకప్ నుంచి ధోనీ వీడ్కోలుపై పలు వదంతులు వస్తూనే ఉన్నాయి. అయితే ఒక్కసారి కూడా అతడు స్పందించలేదు. మహీ కెరీర్ కొనసాగింపుపై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం స్పష్టతనిచ్చారు. ఐపీఎల్ 2020లో సత్తాచాటితే మళ్లీ జట్టులోకి వస్తాడని పేర్కొన్నారు. అయితే తాజాగా ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ మహీ అభిమానులకు ఓ శుభవార్తను అందించింది.

2022 వరకు:
ఐపీఎల్‌లో 2021, 2022 ఎడిషన్‌లలో కూడా సీఎస్‌కే ఫ్రాంచైజీలో ఎంఎస్ ధోనీ భాగమవుతాడని చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ ధీమా వ్యక్తం చేశారు. 2020, 2021 సీజన్లలో కచ్చితంగా మహీ పాల్గొంటాడని, 2022లో సైతం ఆడతాడని తాము అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. 'ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2020, 2021 రెండింటిలో భాగమని మేము ఆశిస్తున్నాం. బహుశా తరువాతి సంవత్సరం 2022 వరకు కూడా ఆయన జట్టులో ఉండవచ్చు' అని విశ్వనాథన్ ఇండియాటుడేకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు:
ఎంఎస్ ధోనీకి చెన్నై జట్టు ఎంత అండగా నిలబడుతుందో మరోసారి నిరూపించింది. మహీ సాధన గురించి తమకు ఆందోళనే లేదని స్పష్టం చేసింది. 'ధోనీ ప్రస్తుతం ఇండోర్ నెట్స్‌లో శిక్షణ పొందుతున్నాడని మీడియా ద్వారా తెలిసింది. కానీ మేము మా బాస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జట్టు బాధ్యతల గురించి అతడికి బాగా తెలుసు. జట్టును అతను చూసుకుంటాడు' అని విశ్వనాథన్ పేర్కొన్నారు. ఝార్ఖండ్ ఇండోర్ వసతిలో బౌలింగ్ యంత్రం సాయంతో మహీ సాధన చేసిన విషయం తెలిసిందే.

శ్రీనివాసన్ కూడా:
2021 ఐపీఎల్ వేలంలో సీఎస్‌కే ఎంఎస్ ధోనీని నిలబెట్టుకుంటుందని జట్టు ఫ్రాంచైజీ యజమాని, ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసన్ గత జనవరిలో చెప్పారు. 2021 వరకు మహీ ఆడుతాడని కూడా ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా సీఎస్‌కే ఆగస్టు 16 నుంచి 20 వరకు శిక్షణా శిబిరాన్ని ప్లాన్ చేసింది. ఆగస్టు 21న యూఏఈకి బయలుదేరాలని సీఎస్‌కే ఆశిస్తుండగా.. ఆగస్టు 14న ఆటగాళ్లందరూ చెన్నైలో సమావేశమవనున్నారు. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ లీగ్ ఆరంభం అవుతుండటంతో అందరి చూపూ ఎంఎస్ ధోనీ పైనే నెలకొంది.

ఫ్యామిలీస్‌కి నో ఎంట్రీ:
చెన్నై ఆటగాళ్లు, టీమ్ సపోర్ట్ స్టాఫ్ ఫ్యామిలీస్‌కి యూఏఈ వచ్చేందుకు అనుమతి లేదని సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. 'లీగ్ మొదటి భాగంలో ఆటగాళ్లు, టీమ్ సపోర్ట్ స్టాఫ్ ఫ్యామిలీస్‌కి అనుమతి లేదు. జట్టుతో పాటు ఫ్యామిలీస్ యూఏఈకి రావడం లేదు. యూఏఈ పరిస్థితులను బట్టి రెండో భాగంలో ఫ్యామిలీస్‌ని అనుమతించాలా? వద్దా? అని ఆనిర్ణయం తీసుకుంటాం' అని ఆయన తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
వైరల్ వీడియో.. రివర్స్ హెలికాప్టర్ షాట్.. చూస్తే షాకే!!