For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ అభిమానులకు శుభవార్త.. 2021లో కూడా మహీ ఆడుతాడు!!

MS Dhoni will play for Chennai Super Kings in IPL 2021, confirms N Srinivasan

చెన్నై: గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. తొలుత భారత సైన్యంలో సేవ చేసేందుకు ధోనీ రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. ఆపై కూడా జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. రెండు నెలల విశ్రాంతి కాస్త ఆరు నెలలు దాటింది. దీంతో మహీ రిటైర్మెంట్‌పై అనేక వార్తలు వచ్చాయి. అయినా ధోనీ మాత్రం తన రిటైర్మెంట్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

రిటైర్మెంట్‌పై ఊహాగానాలు:

రిటైర్మెంట్‌పై ఊహాగానాలు:

తాజాగా బీసీసీఐ 2019 అక్టోబర్‌ నుంచి 2020 సెప్టెంబర్‌ వరకూ ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్‌ జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులోనూ ధోనీ పేరు లేదు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనున్న తరుణంలో మహీ పేరు కాంట్రాక్ట్‌ లిస్టులో లేకపోవడం అందరిని విస్మయానికి గురి చేసింది. ఇక ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడనే ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి.

ఝార్ఖండ్‌ రంజీ జట్టుతో ప్రాక్టీస్‌

ఝార్ఖండ్‌ రంజీ జట్టుతో ప్రాక్టీస్‌

అయితే బీసీసీఐ తనను కాంట్రాక్ట్‌ జాబాతా నుంచి తప్పించిన రోజే ధోనీ ఝార్ఖండ్‌ రంజీ జట్టుతో కలిసి మైదానంలో ప్రాక్టీస్‌లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. రంజీ జట్టుతో కలిసిన ధోనీ అక్కడ వైట్‌బాల్‌తో ఎక్కువగా ప్రాక్టీస్‌ చేసాడు. దీంతో ఐపీఎల్‌-2020కి సన్నద్ధం అవుతున్న విషయాన్ని మహీ చెప్పకనే చెప్పేశాడు. అయితే మహీ ఈ ఏడాదే కాదు.. వచ్చే ఏడాది కూడా ఐపీఎల్‌ ఆడతాడని చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని ఎన్‌ శ్రీనివాసన్‌ అంటున్నాడు.

2021 ఐపీఎల్ కూడా ఆడుతాడు

2021 ఐపీఎల్ కూడా ఆడుతాడు

శనివారం ఒక ఈవెంట్‌కు హాజరైన శ్రీనివాసన్‌ మాట్లాడుతూ ధోనీ అభిమానులకు శుభవార్త చెప్పాడు. 'ధోనీ 2020 ఐపీఎల్‌ ఆడుతాడు. 2020 ఐపీఎల్‌తో పాటు 20021 ఐపీఎల్‌లో కూడా ధోనీ తమ జట్టు తరఫున బరిలోకి దిగుతాడు. వచ్చే ఏడాది మహీ వేలంలో ఉన్నా మేమే తీసుకుంటాం. ధోనీపై నమ్మకం ఉంది, వచ్చే రెండు ఐపీఎల్‌ సీజన్లలో ధోనీ నేతృత్వంలోనే బరిలోకి దిగుతాం' అని శ్రీనివాసన్‌ చెప్పుకొచ్చాడు.

ప్రారంభం నుండి చెన్నై జట్టుకే ధోనీ:

ప్రారంభం నుండి చెన్నై జట్టుకే ధోనీ:

ధోనీ ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై జట్టుకే ఆడుతున్నాడు. సారధిగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. నిషేధం సమయంలో రెండు సంవత్సరాలకు పూణే జట్టుకు ఆడాడు. మహీ చెన్నై జట్టుకు మూడుసార్లు టైటిల్‌ అందించాడు. గతేడాది హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్‌తో తలపడి ఒక్క పరుగుతో చెన్నై ఓటమిపాలైంది. అయితే ఈసారి టైటిల్ గెలవాలని చెన్నై కసిగా ఉంది.

Story first published: Sunday, January 19, 2020, 11:45 [IST]
Other articles published on Jan 19, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+