భయమంటే ఏంటో తెలియదు: ధోని అదే నేర్పించాడంటున్న డ్వేన్ బ్రావో

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్‌లో కచ్చితంగా ఆడతాడని విండిస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ధీమా వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఏడాది తర్వాత బ్రేవో తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
త్వరలో జరగబోయే విండీస్ టీ20 సెలక్షన్స్‌కు కూడా అందుబాటులో ఉంటానని వెల్లడించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో ధోని కెప్టెన్సీలో బ్రావో ఆడిన సంగతి తెలిసిందే. వెస్టిండిస్ బోర్డులో సానుకూల మార్పులతో తాను తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేస్తున్నట్లు శనివారం ఓ ఇంటర్యూలో వెల్లడించాడు.

బ్రావో మాట్లాడుతూ
ఈ సందర్భంగా బ్రావో మాట్లాడుతూ "ధోనీ ఇంకా వీడ్కోలు పలకలేదు. అందుకే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఆడతాడనే అనుకుంటున్నా. మైదానం బయట జరిగే సంఘటనలు ధోనీని ప్రభావితం చేయవు. మాకు అదే నేర్పించాడు. ఎప్పుడూ భయపడొద్దని, సామర్థ్యంపై నమ్మకం ఉంచాలని చెప్పేవాడు" అని బ్రావో అన్నాడు.

తన పునరాగమనంపై బ్రావో ఇలా
ఇక, తన పునరాగమనంపై బ్రావో "శారీరకంగా బాగున్నాను. ఇంకా ఆడగలను. మైదానం బయట రాజకీయాలతో నేను ఆటకు వీడ్కోలు పలికాను. ప్రస్తుతం మైదానంలో, బయటా నాయకత్వ మార్పులు జరిగాయి. పునరాగమనానికి ఇదే మంచి సమయం. జట్టులో యువకులు, ప్రతిభావంతులు ఉన్నారు" అని అన్నాడు.

రసెల్, నరైన్ వంటి సీనియర్లు
"ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్ వంటి సీనియర్లు రానున్నారు. మేము మళ్లీ టీ20 వరల్డ్‌కప్ విజేతగా అవతరించగలం. పొలార్డ్ యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతున్నాడు. కోచ్ సిమ్మన్స్, పొలార్డ్ ఇద్దరూ యువ ఆటగాళ్లకు పూర్తిగా స్వేఛ్చనిచ్చారు. తప్పులు చేసి వాటి నుంచి నేర్చుకునేందుకు అవకాశం కల్పించారు" అని బ్రావో తెలిపాడు.

భయం లేని క్రికెట్
"తమను తాము వ్యక్తీకరించుకునే ఈ స్వేచ్ఛ యువతను నిర్భయమైన క్రికెట్ ఆడుతోంది. మా జట్టులో మంచి బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఉన్నారు. కావాల్సిందల్లా మంచి మార్గనిర్దేశం. టీ20 ప్రపంచకప్‌నకు ఏడాది సమయం ఉంది కాబట్టి దానికి సన్నద్ధం కాగలను. నేను ప్రశాంతంగా ఉంటాను. ఒత్తిడి నన్ను ఇబ్బంది పెట్టదు. టీ20ల్లో ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రశాంతత చాలా అవసరం" అని బ్రావో చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications