'ఇప్పటికి ధోనినే మా కెప్టెన్, మైదానంలో ముద్దు పేర్లతోనే పిలుస్తాడు'
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలో కెప్టెన్సీ లక్షణాలు పుష్కలం. కెప్టెన్సీకి వీడ్కోలు పలికినప్పటికీ, ఇప్పటికీ మైదానంలో ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీకి విలువైన సూచనలు చేస్తూనే ఉంటాడు. ముఖ్యంగా స్పిన్నర్లకు వికెట్ల వెనుక నిల్చుని బంతులు ఎలా వేయాలో సూచిస్తుంటాడు.

ఇప్పటికీ మా కెప్టెన్ ధోనియే
కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్నప్పటికీ ఇప్పటికీ మా కెప్టెన్ ధోనియేనని తాజాగా ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్. ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ మాట్లాడుతూ 'ఇప్పటికీ మా కెప్టెన్ ధోనినే. ఎందుకుంటే మైదానంలో కొన్నిసార్లు కోహ్లీ మాకు అందుబాటులో ఉండడు. మిడ్ ఆన్ లేదా లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఉంటాడు' అని అన్నాడు.

కోహ్లీకి దూరంలో ఉంటాడు
'అలాంటి సమయంలో మమ్మల్ని ఎవరు గైడ్ చేస్తారు. కోహ్లీకి దూరంలో ఉంటాడు కాబట్టి కుదరదు. ఇటువంటి పరిస్థితుల్లో ఫీల్డింగ్ మార్చమని ఎవరితో చర్చించాలి. అలాంటి సమయంలో వికెట్ల వెనుకన ఉన్నా ధోని మాకు కనిపిస్తాడు' అని చాహల్ తెలిపాడు.

కోహ్లీకి ముందుగానే సంకేతాలిస్తాడు
బౌలర్ల పరిస్థితిని అర్ధం చేసుకున్న ధోని 'నువ్వు అక్కడే ఉండు.. నేను చూసుకుంటా' అని కోహ్లీకి ముందుగానే సంకేతాలిస్తాడు. ఇలా చేయడం వల్ల మాకు ఎంతో సమయం ఆదా అవుతోందని చాహల్ చెప్పుకొచ్చాడు. ధోని ఎంతో అనుభవం కలిగిన ఆటగాడని, అతనితో కలిసి మైదానం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు.

ముద్దు పేర్లతోనే పిలుస్తాడు
'మైదానంలో ధోని ఆటగాళ్లను ఎక్కువగా ముద్దు పేర్లతోనే పిలుస్తాడు. నన్ను చోటీ అంటుంటాడు. ధోనీ బ్యాట్స్‌మెన్ మైండ్‌సెట్‌ను చదవగలడు. అది అతనికి ఎలా సాధ్యమైందో నాకు అర్ధం కావడంలేదు. నాకు ఇలా బౌలింగ్ చేయి.. అలా బౌలింగ్ చేయి అని చెప్తుంటాడు. ధోని చెప్పినట్టే చేస్తే వికెట్లు తీయడం ఎంతో సులభం' అని చాహల్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications