న్యూఢిల్లీ: భారత్ వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ ట్వంటీ 20ల్లో ధోనీ చాలా మంచి కెప్టెన్ అని, అలాంటి వాడు తమకు కావాలని వ్యాఖ్యానించాడు.
ట్వంటీ 20ల్లో అతను చాలా ఉత్తమం అని నా అభిప్రాయం అన్నాడు. అతను కెప్టెన్‌గా, ఆటగాడిగా చాలా బెస్ట్ అన్నాడు. అతను టెస్ట్ కెప్టెన్‌గా వద్దని, కానీ ట్వంటీ 20 కెప్టెన్‌గా ధోనీ లాంటి వాడు తమకు కావాలని చెప్పాడు.

వెస్టిండీస్ చేతిలో సెమీ ఫైనల్లో భారత్ ఓడింది. భారత్ 192 పరుగులు చేసింది. దీనిపై ఇయాన్ చాపెల్ మాట్లాడుతూ... ఈ స్కోర్ బాగానే ఉందని చెప్పాడు. రవీంద్ర జడెజా బౌలింగును అతను తప్పుబట్టాడు. బంతి పైన అతను నియంత్రణ కోల్పోయాడని అభిప్రాయపడ్డాడు.
టైటిల్ ఫేవరేట్లో భారత్ ఉందని తాను టోర్నమెంటు మొదట్లో చెప్పానని షేన్ వార్న్ అన్నాడు. అయితే, వెస్టిండీస్‌తో మ్యాచులో వారు బేసిక్ తప్పులు చేశారని చెప్పాడు. రెండు నో బాల్స్ మ్యాచ్ పరాజయానికి ముఖ్య కారణమని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ బాగా ఆడాడని కితాబిచ్చాడు.