Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni: స్మోకింగ్ చేస్తూ దొరికిపోయిన ధోనీ (Video)

దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ మరోసారి వార్తల్లో ట్రెండింగ్‌లో నిలిచాడు. అయితే ఈ సారి క్రికెట్ విషయంలో కాదు, హుక్కాను పీలుస్తూ ధోనీ వార్తల్లోకెక్కాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా క్రమశిక్షణతో హుందాగా ఉండే ధోనీ స్మోకింగ్ చేసే వీడియో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.

ధోనీకి సంబంధించిన హుక్కా వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే అది యాడ్ షూటింగ్‌లో భాగంగా ధోనీ చేశాడని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అది సింథటిక్ స్మోగ్ అని, పూర్తి వివరాలు తెలియకుండా ధోనీని తప్పుపట్టవద్దని కామెంట్లు చేస్తున్నారు. ఎంసీ స్టాన్‌తో కలిసి ధోనీ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే.

MS Dhoni was caught smoking hookah. Video goes viral

అయితే జనవరి 5న రిషభ్ పంత్ సోదరి సాక్షి పంత్ నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు ధోనీ హాజరయ్యాడు.ఈ ఫంక్షన్‌లో ధోనీ హుక్కాను పీల్చాడని మరికొందరు అంటున్నారు. హుక్కా పీలుస్తున్న వీడియోలో, సాక్షి పంత్ నిశ్చితార్థానికి హాజరైన వేడుకలో.. ధోనీ సేమ్ డ్రెస్‌లో ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్నఅంకిత్ చౌదరీతో సాక్షి పెళ్లి పీటలక్కెనుంది.

మరోవైపు ధోనీకి కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని, చిన్న విషయాలను కూడా వివాదాల్లోకి చేర్చకూడని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్కే మాజీ ప్లేయర్ జార్జ్ బెయిలీ గతంలో ధోనీ గురించి చేసిన వ్యాఖ్యలను కొన్ని నేషనల్ మీడియాలు గుర్తుచేయడం గమనార్హం. ''ధోనీకి షీషా లేదా హుక్కా పొగతాగడం ఇష్టం. ధోనీ రూమ్‌లో హుక్కా కనిపించేది. దానిని రహస్యంగా ఉంచాలని కూడా ధోనీ భావించడు'' అని జార్జ్ బెయిలీ అన్నాడు.

కాగా, నూతన సంవత్సర వేడుకలను దుబాయ్‌లో జరుపుకున్న ధోనీ ఇటీవల భారత్‌కు తిరిగొచ్చాడు. ధోనీతో పాటు టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా న్యూ ఇయర్ పార్టీలో కనిపించాడు. డిసెంబర్ 19న ముగిసిన ఐపీఎల్ వేలంలోనూ మహీ, పంత్ ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరూ టెన్నిస్ ఆడిన వీడియోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. 42 ఏళ్ల ధోనీ గతేడాది మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. మరో కొన్ని రోజుల్లో ధోనీ నెట్స్‌లో సాధన మొదలుపెట్టనున్నాడు.

Story first published: Sunday, January 7, 2024, 11:37 [IST]
Other articles published on Jan 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+