For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: అనుభవం vs దూకుడు.. గెలిచేదెవరు?

MS Dhoni vs Vaibhav Suryavanshi: ఇవాళ(మంగళవారం) రాత్రి 7.30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో అట్టడుకున్న ఉన్న ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ప్లేఆఫ్ రేసు పరంగా ఎటువంటి ప్రాముఖ్యతను కలిగి లేదు. కానీ ఎప్పటిలాగే ఎంఎస్ ధోని అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ 2025లో అతిపెద్ద వయస్కుడైన మహేంద్ర సింగ్ ధోని, టోర్నీలో అతి పిన్న వయస్కుడైన వైభవ్ సూర్యవంశీతో తలపడనున్నాడు. వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనింగ్ చేస్తున్నాడు. దీంతో అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎంఎస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు భారీగా స్టేడియానికి తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఎంఎస్ ధోనికి గ్రేట్ ఫినిషర్ అనే పేరు ఉంది. వైభవ్ సూర్యవంశీ మంచి ఓపెనర్ గా రాణిస్తున్నాడు. అంటే ఒకరికి మ్యాచ్ ను ఎలా ముగించాలో తెలిస్తే.. మరొకరికి మ్యాచ్‌ను గొప్పగా ఎలా ప్రారంభించాలో తెలుసన్నమాట. అయితే మార్చి 30న గౌహతిలో సీఎస్కే, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ జట్టులో లేడు. అయితే ఆ మ్యాచ్ తర్వాక ధోనిని కలవడానికి వైభవ్ సూర్యవంశీ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇప్పుడు ధోని వైభవ్‌పై వికెట్ల వెనుక నుంచి ఎలా దాడి చేస్తాడో చూడాల్సిందే.

MS Dhoni vs Vaibhav Suryavanshi Experience Meets Youth in IPL 2025 Clash

14 ఏళ్ల ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ మధ్యలో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తన దూకుడు శైలితో వైభవ్ 6 మ్యాచ్‌ల్లో 195 పరుగులు చేశాడు. అందులో రికార్డు స్థాయిలో సెంచరీ కూడా ఉంది. వైభవ్ తాను ఆడిన 6 మ్యాచ్ ల్లో 219 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. వైభవ్ తన అభిమాన ఆటగాడు ధోని ముందు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రభావం చూపేందుకు ఖచ్చితంగా ఆసక్తిగా ఉంటాడు. సీఎస్కేతో జరిగే ఈ లీగ్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌కు ఈ ఏడాది చివరి మ్యాచ్. రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ జట్టుతో మరో మ్యాచ్ ఆడనుంది.

Story first published: Tuesday, May 20, 2025, 15:13 [IST]
Other articles published on May 20, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+