
సునీల్ నరైన వర్సెస్ ఎంఎస్ ధోని
బౌలర్ ఎవరైన సునాయసంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించే వెటరన్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనిని కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్ భయపెడుతున్నాడు. ఐపీఎల్‌లో ఏ బౌలర్‌పై లేని విధంగా సునీల్ నరైన్‌పై ధోనికి ఉన్న అత్యంత చెత్త రికార్డులు ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. ఈ మెగా లీగ్‌లో ధోనిపై ఈ వెస్టిండీస్ స్పిన్నర్ ఆ స్థాయిలో అధిపత్యాన్ని చెలాయించాడు. ఈ టీ20 లీగ్‌లో సునీల్ నరైన్ బౌలింగ్‌లో ధోని టెస్ట్ క్రికెట్‌లో మాదిరిగా బ్యాటింగ్ చేశాడంటనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

కేవలం 53 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఇప్పవరకు 66 బంతులు ఎదుర్కొన్న మహేంద్ర సింగ్ ధోని కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్‌రేట్ కేవలం 53గానే ఉంది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ధోని ఇప్పటివరకు ఒక్క బౌండరీ మాత్రమే కొట్టాడు. ఒక సారి ఒక ఫోర్ కొట్టాడు. ఒక సిక్సు కూడా కొట్టలేదు. సగటు 35గా ఉంది. ఇక ధోనిని సునీల్ నరైన్ ఒక సారి ఔట్ చేశాడు. ఈ గణాంకాలు టెస్టు క్రికెట్ మాదిరిగా ఉండడం గమనార్హం. కాగా నేడు జరగబోయే మ్యాచ్‌లోనూ ధోనిపై నరైన్ తన అధిపత్యాన్ని కొనసాగిస్తాడా? లేక ఈ సారి ధోని చెలరేగి తన రికార్డులను మెరుగు పరచుకుంటాడా అనేది తెలియాలంటే మరి కొంత సమయం వేచి చూడాలి.

ధోని రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 220 మ్యాచ్‌లాడిన ధోని 39 సగటుతో 4746 పరుగులు చేశాడు. ఇందులో 23 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 84 పరుగులుగా ఉంది. స్ట్రైక్ రేట్ 135గా ఉంది. ఈ క్రమంలో ఎంఎస్ ధోని 325 ఫోర్లు, 219 సిక్సులు బాదాడు.

నరైన్ రికార్డులు
ఐపీఎల్ ఇప్పటివరకు 134 మ్యాచ్‌లాడిన ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ 143 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5/19గా ఉన్నాయి. ఇక బ్యాటింగ్‌లో 15 సగటుతో 954 పరుగులు చేశాడు. 4 హాఫ్ సెంచరీలు చేయగా.. అత్యధిక స్కోర్ 75 పరుగులుగా ఉంది.


Click it and Unblock the Notifications

