సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను సందర్శించిన ధోని
హర్యానాలోని జజ్జార్‌లో ఉన్న సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ధోనీ శుక్రవారం సందర్శించాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చావేదికలో విద్యార్థులతో తన మధుర జ్ఞాపకాలను పంచుకున్నాడు. వాస్తవానికి గతేడాదే ఈ స్కూల్‌కు రావాల్సి ఉన్నప్పటికీ బిజీ షెడ్యూల్ కారణంగా కుదర్లేదని మహీ చెప్పాడు.
విద్యార్థులడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానమిచ్చిన ధోని
చర్చా వేదికలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికతో ధోని సమాధానమిచ్చాడు. అంతేకాదు కెప్టెన్‌గా టీమిండియాకు చిరస్మరణీయ విజలయాందించడం వెనుక దాగి ఉన్న శ్రమ, పట్టుదలను మహీ విద్యార్థులకు వివరించాడు. తన జీవితంలో స్కూల్ డేస్ ఎంతో మధురమైనవని వారితో చెప్పాడు.
పాఠశాల జ్ఞాపకాలను గొప్పగా ఉండేలా చూసుకోండి
ప్రతి ఒక్కరూ పాఠశాల జ్ఞాపకాలను గొప్పగా ఉండేలా చూసుకోవాలని విద్యార్థులకు సూచించాడు. విద్యార్ధులందరిలో స్ఫూర్తిని రగిలిస్తూ సుదీర్ఘ ఉపన్యాసంతో ధోని ఆకట్టుకున్నాడు. చివరగా తనని స్కూల్‌కు ఆహ్వానించిన మాజీ ఓపెనర్ సెహ్వాగ్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.
సెహ్వాగ్‌ను ప్రశంసలతో ముంచెత్తిన ధోని
భవిష్యత్ తరాల కోసం తన విలువైన సమయం, డబ్బును పెట్టుబడిగా పెడుతున్న సెహ్వాగ్‌ను ధోని ప్రశంసలతో ముంచెత్తాడు. తన ఆహ్వానాన్ని మన్నించి పాఠశాలకు విచ్చేసి, విలువైన సమయాన్ని కేటాయించిన ధోనికి సెహ్వాగ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. ఈ కార్యక్రమాన్ని సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశాడు.


Click it and Unblock the Notifications











