ముంబై: బాలీవుడ్‌లో క్రీడాకారుల జీవిత కథల సినిమాల హవా కొనసాగుతోంది. ఇప్పటికే చాలామంది క్రీడాకారుల జీవిత గాథలు సినిమాలుగా వచ్చాయి. భారత క్రికెట్ టెస్ట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ కూడా తెరపైకి వస్తుంది.
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే 'ఎంఎస్ ధోనీ: అన్ టోల్డ్ స్టోరీ' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సెట్లో ధోనీ సందడి చేశాడు. ఈ సినిమాలో ధోనీ పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటిస్తున్నాడు. తన జీవిత కథ ఎలా తెరకెక్కుతుందో చూడాలని ధోనీ ఈ సినిమా సెట్‌కు వెళ్లాడు.

తన చరిత్రను తెరకెక్కించే విధానాన్ని ఆయన స్వయంగా చూసుకున్నాడు! ధోనీ రావడంతో సినిమా యూనిట్ మొత్తం సంతోషంలో మునిగిపోయిందని ధోనీ తండ్రి పాత్రలో నటిస్తున్న అనుపమ్ ఖేర్ చెప్పాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.