Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొత్త జెర్సీల్లో ధోని, కోహ్లీ: కొత్తగా కనిపిస్తోన్న ప్లేయర్లు (వీడియో)

ICC Cricket World Cup 2019 : జెర్సీ రంగు మార్చడం అవసరమా..? || Oneindia Telugu
MS Dhoni, Virat Kohlis First-Look In Indias Away Jersey; See Pictures

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఆదివారం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరెంజ్ జెర్సీతో బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా ధరించే అరెంజ్ జెర్సీని టీమిండియా అధికారిక అపరెల్ స్పాన్సర్ నైకీ శుక్రవారం విడుదల చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ నేపథ్యంలో కోహ్లీసేన ఆరెంజ్ కలర్ జెర్సీలు వేసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఆరెంజ్ కలర్ జెర్సీలో టీమిండియా ప్లేయ‌ర్లు కొత్తగా క‌నిపిస్తున్నారు. నిజానికి ఈ ఆరెంజ్ కలర్ జెర్సీ ఎలా ఉంటుందోనని అభిమానులు ఆందోళన చెందారు. ఆరెంజ్, నీలి రంగు కాంబినేషన్‌లో కొత్త డ్రెస్ చాలా బాగుంది.

సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు

ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జట్టు అధికారిక స్పాన్సర్ నైకీ సంస్థ ఈ జెర్సీకి రూపకల్పన చేసింది. తేలికపాటిగా, శరీరంపై చెమట త్వరగా ఆరిపోయేలా సౌకర్యవంతంగా జెర్సీని డిజైన్ చేశారు. ఇన్నాళ్లు నీలి రంగుకు అలవాటు పడ్డ అభిమానులకు టీమిండియా ఆరెంజ్ జెర్సీలో అలరించనుంది.

చాహల్, షమీ, రాహుల్ కొత్త జెర్సీలు ధరించి

చాహల్, షమీ, రాహుల్ కొత్త జెర్సీలు ధరించి

చాహల్, షమీ, రాహుల్ కొత్త జెర్సీలు ధరించి ఫొటోలను భారత క్రికెట్ జట్టు ఇనిస్టాగ్రామ్‌లో అభిమానుల కోసం బీసీసీఐ షేర్ చేసింది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఐసీసీ నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశం మినహాయించి ప్రతి జట్టు రెండు రంగుల కిట్‌ల వివరాల్ని అందజేయాలి.

రెండు జట్ల జెర్సీల రంగు ఒకే విధంగా ఉన్నప్పుడు

రెండు జట్ల జెర్సీల రంగు ఒకే విధంగా ఉన్నప్పుడు అందులో ఒక జట్టు.. వేరే రంగు జెర్సీని ధరించాలి. ఇంగ్లాండ్, ఇండియా దేశాలకు చెందిన జట్ల జెర్సీలు నీలి రంగులో ఉండటంతో మ్యాచ్ వీక్షించేటప్పుడు అభిమానులు, అంపైర్లు, మైదానంలోని ఆటగాళ్లు కూడా గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. దీంతో హోమ్.. అవే విధానంలో ఆతిథ్య జట్టు ధరించే జెర్సీలో ఎలాంటి మార్పు ఉండదు.

టీమిండియా నారింజ రంగు జెర్సీ ఎందుకంటే!

దీంతో టీమిండియా నారింజ రంగు జెర్సీ వేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు కొత్త జెర్సీలతో బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. 1992 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ ధరించిన నేవీ బ్లూ కలర్ జెర్సీతో ఈ టోర్నమెంట్ ఆడుతుండగా.... ఇటీవలే శ్రీలంక సైతం తన జెర్సీని మార్చుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Saturday, June 29, 2019, 11:56 [IST]
Other articles published on Jun 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+