Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆటగాళ్లకు మైక్‌లో ధోనీ చెబుతున్న సలహాలు(వీడియో)

MS Dhoni, Virat Kohli's chatter caught on stump mic in Centurion ODI

హైదరాబాద్: ధోనీ లేకుండా టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత్ జట్టు ఆఖరు టెస్టు మినహాయించి ముందు రెండు టెస్టుల్లోనూ పరాజయాన్ని చవిచూసింది. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరడంతో భారత జట్టు కాస్త ఊపిరి పీల్చుకుంది. ధోనీ సలహాలతో రెండు వన్డేల్లోనూ విజయాన్ని నమోదు చేసింది.

కెప్టెన్సీకి మాజీ అయిపోయినా, వయసు పెరిగిపోయి రిటైర్‌మెంట్‌కు ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. అతనికి జట్టుపై ఉన్న కమిట్‌మెంట్ అలాంటిది. సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ధోనీ బౌలర్లకి ఇచ్చే సలహాలు స్పష్టంగా రికార్డయ్యాయి. వినడానికి సరదాగా ఉన్నా అవి జట్టు గెలిచేందుకు కీలకమైనవి.

ఈ మ్యాచ్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న సోనీ నెట్ వర్క్ ధోనీ రికార్డింగ్‌లను యూట్యూబ్‌లో ఉంచింది. స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ సింగ్‌కు ధోనీ ఇచ్చిన సూచనలు మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రొటీస్ ఆటగాళ్లకు అర్థం కాకుండా హిందీలో ధోనీ ఇచ్చే సూచనలు భలే ఫన్నీగా అనిపిస్తున్నాయి.

బాల్ వచ్చే తీరును గమనిస్తూ బ్యాట్స్‌మెన్ ఆటతీరును అంచనా వేస్తూ ధోనీ ఇచ్చే సలహాలు తుచా తప్పకుండా పాటించారు మన భారత బౌలర్లు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 6, 2018, 17:23 [IST]
Other articles published on Feb 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+