ధోని, కోహ్లీ లేకపోతే ఇంతే!: 4వ వన్డే ఓటమిపై నెటిజన్ల సెటైర్లు


హైదరాబాద్: న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా చెత్త ఓటమిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తుది జట్టులో లేకుంటే టీమిండియా పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉంటుందా? అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఐదు వన్డేల సిరీస్‌లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా ఇప్పటికే 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకోవడం... ఆ తర్వాత సెలక్టర్లు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో జట్టుని నడిపించే బాధ్యతను రోహిత్ శర్మ తీసుకున్నాడు.

తొడ కండరాల గాయం కారణంగా
మరోవైపు తొడ కండరాల గాయం కారణంగా మూడో వన్డేకి దూరమైన ధోని ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో నాలుగో వన్డేలోనూ రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేశారు. దీంతో నాలుగో వన్డేలో కోహ్లీ, ధోనిలు లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కివీస్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (5/21), గ్రాండ్‌హోమ్ (3/26) దెబ్బకు 30.5 ఓవర్లలోనే భారత్ 92 పరుగులకి ఆలౌటైంది.

ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే
ఈ మ్యాచ్‌లో టీమిండియాలోని ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవగా.. ఇందులో ఇద్దరు బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్, అంబటి రాయుడు డకౌట్ రూపంలో వెనుదిరిగారు. శిఖర్ ధావన్(13), పాండ్యా(16) చాహల్(18 నాటౌట్), కుల్దీప్(15)లు మాత్రమే రెండంకెల స్కోరును చేయడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో భారత జట్టుపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తాజా విజయంతో ఎట్టకేలకి పర్యటనలో భారత్‌కు తొలి ఓటమి రుచి చూపిన న్యూజిలాండ్ సిరీస్‌లో ఆధిక్యాన్ని కూడా 1-3కి తగ్గించింది.
కోహ్లీ లేని భారత జట్టును నమ్మడం ఎలా?
దీంతో కోహ్లీ, ధోని లేని టీమిండియాను కివీస్ బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారని నెటిజన్లు కితాబిస్తున్నారు. కోహ్లితో పాటు మొత్తం జట్టంతా ‘హాలీడే' ప్రకటించినట్లు కనబడుతుందని ఎద్దేవా చేశారు. ఇంతటి దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంటే కోహ్లీ లేని భారత జట్టును నమ్మడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications