For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీసేన పార్టీలో ధోని: ట్విట్టర్‌లో ఫోటో పెట్టిన పాండ్యా

By Nageshwara Rao
MS Dhoni, Virat Kohli, Hardik Pandya celebrate Johannesburg Test win

హైదరాబాద్: కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా జోహెన్స్‌బర్గ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో కోహ్లీసేన 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టెస్టు సిరిస్ వైట్ వాష్ నుంచి తప్పించుకుంది.

దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను దక్షిణాప్రికా 2-1తేడాతో సొంతం చేసుకుంది. తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల ఓటమితో పూర్తి నైరాశ్యంలోకి వెళ్లిన టీమిండియాకు మూడో టెస్టు విజయం కాస్తంత ఊరటనిచ్చింది. మూడు టెస్టు విజయాన్ని కోహ్లీసేన టీమిండియా మాజీ కెప్టెన్ ధోనితో కలిసి చేసుకోవడం విశేషం.

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య త్వరలో ఆరంభమయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం ధోనితో పాటు మరికొందరు ఆటగాళ్లు ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జోహెన్నెస్‌బర్గ్‌ టెస్టు మ్యాచ్‌లో కోహ్లీసేన విజయం తర్వాత జరిగిన పార్టీలో ధోని కూడా పాలుపంచుకున్నాడు.

ఈ పార్టీలో విరాట్‌ కోహ్లీతో పాటు ధోని, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, యజువేంద్ర చాహల్‌లు ఉన్నారు. ఈ మేరకు శనివారం రాత్రి సాండ్‌టాన్‌లో జరిగిన జట్టు సెలబ్రేషన్స్‌ ఫొటోను పాండ్యా ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. 'జట్టు సభ్యులతో కలిసి విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడం మరచిపోలేని అనుభూతి' అని ఫోటోకు క్యాప్షన్ పెట్టాడు.

గురువారం (ఫిబ్రవరి 1) నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆరు వన్డేల సిరీస్‌ ఆరంభం కానుంది. తొలి వన్డే డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో జరగనుంది.

వన్డే సిరిస్ షెడ్యూల్:
1st ODI:
Feb 01, 2018, Thursday @ Kingsmead, Durban
05:00 PM (IST)

2nd ODI: Feb 04, 2018, Sunday @ Supersport Park, Centurion
01:30 PM (IST)

3rd ODI: Feb 07, 2018, Wednesday @ Newlands, Cape Town
05:00 PM (IST)

4th ODI: Feb 10, 2018, Saturday @ New Wanderers Stadium, Johannesburg
05:00 PM (IST)

5th ODI: Feb 13, 2018, Tuesday @ St George's Park, Port Elizabeth
05:00 PM (IST)

6th ODI: Feb 16, 2018, Friday @ Supersport Park, Centurion
05:00 PM (IST)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 29, 2018, 13:37 [IST]
Other articles published on Jan 29, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+