Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కూల్ కెప్టెన్ ధోనీ.. రన్ మెషీన్ కోహ్లీల మధ్య పోలికలు, తేడాలు

MS Dhoni and Virat Kohli: Analysing similarities and differences

హైదరాబాద్: 1990ల ముందు వరకూ ఉన్న టీమిండియా స్థితి గతులను టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మారిస్తే.. అతని తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ మరింత ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరి శైలి వేరైనా భారత జట్టును ముందుకు నడిపించడంలో తగిన స్థాయిలో కష్టపడ్డారు. అన్ని ఫార్మాట్లలోనూ ధోనీ టీమిండియాను విజయపథంలో నడిపించిన ధోనీ.. కెప్టెన్సీని విరాట్ కోహ్లీకి అప్పగించాడు. నాయకత్వంతో కోహ్లీ పరుగుల వరద పారిస్తూనే భారత జట్టును ప్రపంచంలోనే మొదటి స్థాయిలో నిలబెట్టాడు.

ప్రత్యర్థి జట్టుపై విధ్వంసం సృష్టించడంలో:

ప్రత్యర్థి జట్టుపై విధ్వంసం సృష్టించడంలో:

ధోనీ ఫామ్‌లో ఉన్నప్పుడు కొన్నేళ్ల పాటు భారత జట్టుకు దూకుడుగా ఆడి పరుగుల వరద పారించాడు. వికెట్ కీపర్‌గా బ్యాట్స్‌మన్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. క్రికెట్‌ను హుందాగా నడిపించి.. తనకంటూ కెప్టెన్ కూల్ అనే ఇమేజ్‌ను ఏర్పరచుకున్నాడు. కోహ్లీ అరంగ్రేట మ్యాచ్‌లను మినహాయించి మిగిలిన అన్నీ మ్యాచ్‌లలోనూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఒకసారి ఫామ్ అందుకున్న కోహ్లీ ఇంక వెనక్కు తిరిగి చూడకుండా సాగిపోయాడు. ఒక బ్యాట్స్‌మన్‌గా ప్రత్యర్థిపై విధ్వంసం సృష్టించాడు.

జట్టును గెలిపించడంలో:

జట్టును గెలిపించడంలో:

మ్యాచ్‌ను గెలవడంలో ధోనీ భారత్‌కు ఓ కళను అలవరచాడు. బ్యాటింగ్ పొజిషన్ ఆరో స్థానంలో దిగి మ్యాచ్‌ను తిప్పేసి ఫలితాలను తారుమారు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అతనిలోని కాన్ఫిడెన్స్, నిబద్ధత మరో క్రికెటర్‌లో ఇప్పటివరకూ మరెవ్వరి దగ్గర కనిపించవు. కోహ్లీ చాలా తక్కువ సమయంలోనే టీమిండియా బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. జట్టును చక్కగా నడిపిస్తాడు. ఏ మాత్రం అవకాశం దొరికినా వదలకుండా జట్టుకు భారీ పరుగులు పారించడమే పనిగా దూసుకెళ్తాడు.

కెప్టెన్సీ‌లో ఒకరు కామ్.. మరొకరు బూమ్:

కెప్టెన్సీ‌లో ఒకరు కామ్.. మరొకరు బూమ్:

మైదానంలో ప్రశాంతంగా కనిపించే ధోనీ.. ఎంతటి ఒత్తిడిలోనైనా మొహంపై భావాలను కనిపించనీయడు. మ్యాచ్‌ను సరిగ్గా అంచనా వేయగల దిట్ట. అందుకే ప్రత్యర్థి జట్టు ధోనీని అంచనా వేయడంలో కాస్త తడబడుతుంటారు. అదే ధోనీకి బలం కూడా. ఇందుకు కోహ్లీ పూర్తిగా విరుద్ధం. మైదానంలోని తన భావాలను మొహం మీదనే చూపించేస్తుంటాడు కోహ్లీ. పరిస్థితిని బట్టి కొద్ది క్షణాల్లోనే భావాలను మార్చేస్తుంటాడు. అతనిలో నాయకత్వ లక్షణాలతో ఎప్పటికప్పుడు ప్రశార్థకంగానే కనిపిస్తుంటాడు. అతని పరుగుల వరదే అతన్ని అందరికంటే టాప్‌లో ఉంచింది.

ఇద్దరిలో ఉన్న సామీప్యత ఎక్కడంటే:

ఇద్దరిలో ఉన్న సామీప్యత ఎక్కడంటే:

వీరిద్దరిలో పోలికలు లేకపోలేదు. ఇద్దరికీ క్రికెట్ అంటే అమితమైన పాషన్. జట్టు కోసం తప్ప వ్యక్తిగత స్కోరుకు ప్రాధాన్యతనివ్వరు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఇద్దరూ సమానంగా కనిపిస్తారు. అందుకోసం అడ్మినిస్ట్రేషన్‌తో తగువుకు దిగేందుకైనా సిద్ధపడతారు. ప్రతి రోజూ సహచరుల నుంచి.. ప్రత్యర్థి జట్టు నుంచి నేర్చుకుంటూనే ఉంటారు. బాధ్యతను తీసుకుంటూ వారి పనులను చేసుకుంటూ పోతారు. కొన్నేళ్లుగా భారత క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లపై వీరి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వీరి జోడీలో ఒకవేళ ధోనీని 'గురు'గా భావిస్తే.. కోహ్లీని అనుచరుడిగా చెప్పుకోవాలి.

Story first published: Tuesday, November 6, 2018, 12:38 [IST]
Other articles published on Nov 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+