ధోనీ బ్యాట్ లోగోల మర్మమేంటీ? ఓ సారి ఎస్‌జీ..మరోసారి బీఎఎస్..ఇంకోసారి ఎస్ఎస్!

లండన్: ప్రపంచకప్ టోర్నమెంట్ మెగా ఈవెంట్.. ముగింపు దశకు వస్తున్న కొద్దీ.. భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్‌మెంట్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. క్రికెట్ పండితులు, అభిమానులు, విశ్లేషకులు.. ధోనీ క్రికెట్ నుంచి వీడ్కోలు చెప్పడంపైనే తమ దృష్టిని కేంద్రీకరించారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తరువాత, ఈ చర్చ పతాక స్థాయికి చేరుకునే అవకాశాలు లేకపోలేదు. ప్రపంచకప్ టోర్నమెంట్ ముగిసిన వెంటనే ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతారంటూ ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి.

ఇక ఎంతో కాలం క్రికెట్ ఆడలేరా?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారులు ఒకరిద్దరు ఇదే విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు కూడా. అది అనధికారికం. ప్రపంచకప్ టోర్నమెంట్‌తో తన కేరీర్‌కు ముగింపు పలుకుతానని ధోనీ సైతం కొన్ని సందర్భాల్లో నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ధోనీ లావాదేవీలను పర్యవేక్షించే ఆయన మేనేజర్ అరుణ్ పాండే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనీ ఇక ఎంతో కాలం క్రికెట్ ఆడకపోవచ్చని చెబుతున్నారాయన. ధోనీ రిటైర్‌మెంట్ వ్యవహారానికి, ఆయన వినియోగించే బ్యాట్‌లపై ఉన్న లోగోలకు ముడిపెట్టారు.

ధోనీ స్పాన్సర్లు..
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ధోనీ బ్యాటింగ్ కోసం క్రీజులో దిగిన సమయంలో ఆయన బ్యాట్‌పై ఏ ఒక్క లోగోనో కనిపించట్లేదు. ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో లోగో కనిపిస్తోంది. ఓ సారి ఎస్‌జీ గానీ, మరోసారి ఎస్ఎస్, ఇంకోసారి, బీఎఎస్ ఇలా ఈ మూడు కంపెనీల లోగోలు దర్శనమిస్తున్నాయి. ఈ మూడు సంస్థలన్నీ క్రికెట్ బ్యాట్లను తయారు చేసేవే. ఇక ఎంతో కాలం క్రికెట్ ఆడకపోవచ్చనే ఉద్దేశంతోనే ధోనీ.. ఆయా సంస్థలకుక సంబంధించిన బ్యాట్లను క్రీజులో వినియోగిస్తున్నారని అరుణ్ పాండే వెల్లడించారు. క్రికెటర్‌గా ధోనీ తన ప్రస్థానాన్ని ఆరంభించిన తొలి రోజుల నుంచీ.. ముగింపు దశకు వచ్చే వరకూ ధోనీ ఈ మూడు సంస్థలకు చెందిన బ్యాట్లను వినియోగించాడని పాండే వివరించారు.

డబ్బులు తీసుకోకుండా..
కేరీర్ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో.. ఆయా సంస్థల బ్యాట్లను వినియోగిస్తూ, ఓ రకంగా వారికి తన కృతజ్ఞతలను తెలియజేస్తున్నాడని అరుణ్ పాండే స్పష్టం చేశారు. లోగోలను వినియోగిస్తున్నందుకు- ధోనీ ఆయా కంపెల యాజమాన్యం నుంచి డబ్బులు తీసుకోవట్లేదని పేర్కొన్నారు. తన కేరీర్ మొత్తానికీ స్పాన్సర్‌షిప్ చేసినందుకు కృతజ్ఞతగా బ్యాట్‌పై ఆయా కంపెనీల లోగోలను వాడుతున్నారని చెప్పారు పాండే. ప్రస్తుతం ధోనీకి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications