ఆర్మీ ఆఫీసర్స్‌పై కథలు: ప్రొడ్యూసర్‌గా మారిన ధోని, 2020లో విడుదల

హైదరాబాద్: భారత ఆర్మీపై తనకున్న అభిమానాన్ని ధోని చాటుకుంటూనే ఉన్నాడు. తాజాగా ధోని భారత సైనికాధికారులపై ఓ టీవీ సిరీస్‌ను తీసే ప్రయత్నాల్లో ఉన్నాడట. టెరిటోరియల్ ఆర్మీ పారాచూట్ రెజిమెంట్ విభాగంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని మన సైనికుల కోసం మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు.
వారితో కలిసి పనిచేసినపుడు సైనికుల సమస్యల మీద కొంత అవగాహన ఏర్పడడంతో సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో తెలియజేసేందుకు సొంతంగా ఒక టీవీ షోని నిర్మించేందుకు ధోని సిద్దమయ్యాడు. సైనికాధికారులు దేశం కోసం చేసిన, చేస్తున్న కృషిని గురించి అందరికీ తెలియచేసేలా ఈ షో నిర్వహించనున్నారని తెలుస్తోంది.
"అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి పరమవీర చక్ర, అశోక చక్ర అవార్డులు సాధించిన ఆర్మీ అధికారులపై కథనాలను ఈ షో వివరిస్తుంది. వాళ్ల స్ఫూర్తిదాయక జీవితాలను దేశ ప్రజలకు తెలి యజెప్పాలనేది ధోనీ ఆలోచన. వచ్చే ఏడాది ఈ సిరీస్ ప్రసారమవుతుంది. ప్రస్తు తం స్ర్కిప్ట్ పనులు జరుగుతున్నాయి" అని ధోనీ సన్నిహితులు తెలిపారు.
స్టూడియో నెక్స్ట్, ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించే ఈ సిరీస్ సోనీ టీవీలో ప్రసారం కానుంది. ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత తొలుత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోని విండిస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు.
నవంబర్ 3 నుంచి బంగ్లాతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కూడా ధోనీకి చోటు దక్కలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications