Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

13 ఏళ్ల తర్వాత రైలులో ధోని: సహచరులతో కలిసి ఫోటో వైరల్

హైదరాబాద్: ఐపీఎల్‌లో కెప్టెన్సీకి దూరమైన రెండు రోజులకే మహేంద్ర సింగ్ ధోని ఫిబ్రవరి 25 నుంచి జరిగే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో జార్ఖండ్‌ కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు ధోని సారథ్యంలోని 18 మంది సభ్యుల జట్టును మంగళవారం ప్రకటించారు.

ఈ టోర్నీలో పాల్గొనేందుకు ధోని జార్ఖండ్ జట్టు సహచరులతో జార్ఖండ్ నుంచి కోల్‌కతాకు రైలులో ప్రయాణించాడు. దీనికి సంబంధించిన ఫోటోను ధోని తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 25వ తేదీన ఓపెనింగ్ మ్యాచ్‌లో జార్ఖండ్ జట్టు కర్ణాటకతో తలపడనుంది.

ఓపెనింగ్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో

ఓపెనింగ్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో

ఈ ఓపెనింగ్ మ్యాచ్‌కి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఆతిథ్యమిస్తుంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్లలో ధోని ఒకడు. అంతేకాదు భారత్‌లోని రిచెస్ట్ క్రికెటర్లలో కూడా ఒకడిగా గుర్తింపు పొందాడు.

హతియా నుంచి హౌరాకు రైలులో బయల్దేరిన ధోని

ధోని తలచుకుంటే ఫ్లయిట్‌లో కోల్‌కతాకు వెళ్లొచ్చు. కానీ జట్టు సహచరులతో విజయ్ హాజారే టోర్నీ కోసం ఏసీ ఫస్ట్ టైర్‌లో హతియా నుంచి హౌరాకు బయల్దేరాడు. ఈ సందర్భంగా ధోని '13 ఏళ్ల తర్వాత రైలులో ప్రయాణిస్తున్నాను. ఇది లాంగ్ రూట్, నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా జట్టు సహచరులతో కూడా మాట్లాడాను' అని ధోని కామెంట్ పెట్టాడు.

హౌరా రైల్వే స్టేషన్‌లో టికెట్ కలెక్టర్‌గా

హౌరా రైల్వే స్టేషన్‌లో టికెట్ కలెక్టర్‌గా

ధోని నేతృత్వంలోని టీమిండియా టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని సైతం కైవసం చేసుకుంది. టీమిండియా జట్టులో చోటు దక్కించుకోక ముందు మహేంద్ర సింగ్ ధోని హౌరా రైల్వే స్టేషన్‌లో టికెట్ కలెక్టర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.

ఇండియన్ రైల్వేస్‌తో ధోనిది విడదీయలేని బంధం

ఇండియన్ రైల్వేస్‌తో ధోనిది విడదీయలేని బంధం

ఇండియన్ రైల్వేస్‌తో ధోనికి ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ఫిబ్రవరి 26వ తేదీన ఇదే వేదికలో ఛత్తీస్‌గడ్‌తో జార్ఖండ్ జట్టు తలపడనుంది. రెండు రోజుల క్రితం ఐపీఎల్‌లో పూణె ప్రాంఛైజీ ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఆ జట్టు నాయకత్వ బాధ్యతలను స్టీవెన్‌ స్మిత్‌కు అప్పగించింది.

జార్ఖండ్‌కు తొలి సారి కెప్టెన్‌గా

జార్ఖండ్‌కు తొలి సారి కెప్టెన్‌గా

భారత్‌కు 331 అంతర్జాతీయ మ్యాచ్‌లలో, 143 ఐపీఎల్‌ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని జార్ఖండ్‌కు తొలి సారి కెప్టెన్‌ కావడం విశేషం. ఇక రంజీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకు మెంటార్‌గా కూడా వ్యవహరించాడు. గ్రూప్‌ డీలో జార్ఖండ్‌తోపాటు చత్తీ‌స్‌గఢ్‌, హైదరాబాద్‌, జమ్మూ కాశ్మీర్‌, కర్ణాటక, సౌరాష్ట్ర, సర్వీసెస్‌ తదితర జట్లు ఉన్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+