బెంగళూరు: మహేంద్ర సింగ్ ధోనీ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినా తన జట్టు జార్ఖండ్‌కు ఓటమి తప్పలేదు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శుక్రవారం జరిగిన గ్రూప్ బి మ్యాచులో 6 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది.
దేశావళీ పరిమిత ఓవర్ల మ్యాచులో ధోనీ ఆడుతున్నాడని తెలిసి అభిమానులు మైదానానికి వచ్చారు. సుమారు 150మందికిపైగా అభిమానులు ధోనీ ఆటను చూసేందుకు వచ్చారు. గురువారం జమ్మూకాశ్మీర్ జట్టుతో జరిగిన మ్యాచులో కేవలం 9 పరుగులకే ఔటైన ధోనీ.. నేటి మ్యాచులో కీలక ఇన్నింగ్స్ చేశాడు.

మ్యాచ్ ఆలస్యమైన కారణంగా ఆటను 47 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన గుజరాత్ జట్టు కెప్టెన్ పార్థీవ్ పటేల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఆటగాళ్లు కొంత పోరాటం చేయడంతో 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది జార్ఖండ్.
ఆ తర్వాత 47ఓవర్లకు మ్యాచును కుదించడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్.. కేవలం 40.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసి విజయం సాధించింది. గుజరాత్ తరపున పికె పంచల్ 62 పరుగులు చేసి టాప్ స్కారర్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్ 28పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.