For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫోన్ తీయట్లేదు: ధోనీపై యువరాజ్ షాకింగ్ కామెంట్

న్యూఢిల్లీ: భారత క్రికెట్ వన్డే, ట్వంటీ 20 క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి అడిగినప్పుడు.. యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్ చేశాడు. సెప్టెంబర్ 4వ తేదీన యువరాజ్ ఫ్యాషన్ లైన్ ప్రారంభమైంది. దీనికి పలువురు హాజరయ్యారు. ధోనీ మాత్రం హాజరు కాలేదు.

MS Dhoni 'too busy' to pick my calls: Yuvraj Singh

ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, అర్జున్ రాంపాల్, ఫరాన్ అక్తర్, ఫరాహ్ కాన్, క్రికెటర్లు క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, ఇతర భారత క్రికెటర్లు ఇలా ఎందరో.. యువరాజ్ వైడబ్ల్యూసి ఫ్యాషన్ ప్రారంభోత్సవానికి వచ్చారు. దీనిపై వచ్చి లాభాన్ని అతను చారిటీకి ఉపయోగించనున్నాడు.

ఈ కార్యక్రమానికి వీరేంద్ర సెహ్వాగ్, రోహిత శర్మ, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ కైఫ్, హాకీ స్టార్ పీఆర్ శ్రీజేష్ తదితరులు కూడా వచ్చారు. వీరంతా యువీకి బెస్ట్ విషెస్ చెప్పారు.

ఈ కార్యక్రమానికి ధోని రాకపోవడంపై.. యువీని ప్రశ్నించారు. యువరాజ్ ఆసక్తికర సమాధానం చెప్పాడు.

ధోనీ చాలా బిజీగా ఉన్నాడనుకుంటున్నానని, అతనికి నేను ఫోన్ చేశానని, సాధారణంగానే అతను తన ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పాడు. ట్వంటీ 20 గేమ్స్‌తో అతను బిజీగా ఉన్నాడేమో అన్నాడు. కాగా, ప్రస్తుతం ధనీ అమెరికాలో ట్వంటీ 20 గేమ్స్ షెడ్య్లూల్లో ఉన్న విషయం తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+