For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Deepak Chahar love story: ధోని కథ నడిపాడంటగా: ఆ ప్రపోజ్ వెనుక పెద్దన్న పాత్ర

MS Dhoni told Deepak Chahar to propose his girlfriend after the last league game
Deepak Chahar Love Story ప్రపోజ్ వెనుక MS Dhoni మాస్టర్ మైండ్ | Who is Jaya Bhardwaj?|| Oneindia

అబుధాబి: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం సాయంత్రం నాటి మ్యాచ్.. ఓ ప్రేమికుల జంటను కలిపింది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ చివరి లీగ్ మ్యాచ్‌ ముగిసిన అనంతరం బౌలర్ దీపక్ చాహర్.. తన లవ్‌స్టోరీని తెరమీదికి తీసుకొచ్చాడు. తన ప్రియురాలిని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యామిలీ గ్యాలరీలో తన ప్రేయసి జయ భరద్వాజ్‌కు ప్రపోజ్ చేశాడు.

చాలామంది క్రికెటర్ల తరహాలోనే దీపక్ చాహర్ కూడా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతోన్నాడు. టీమిండియా సహా వేర్వేరు దేశాలకు చెందిన క్రికెటర్లు వైవాహక జీవితం.. లవ్ స్టోరీలతోనే మొదలైంది..పెళ్లి పీటల దాకా వెళ్లింది. క్రికెటర్ల లవ్‌స్టోరీలు ట్రాజెడీగా ముగిసిన సందర్భాలు చాలా తక్కువ. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ముగిసిన వెంటనే దీపక్ చాహర్-జయ భరద్వాజ్ ఒక్కటవుతారని తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్.. స్టాండ్ బై ప్లేయర్‌గా సెలెక్ట్ అయ్యాడు.

ఈ ప్రేమకథ వెనుక చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రమేయం ఉందట. నిజానికి- దీపక్ చాహర్.. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచులు ముగిసిన తరువాత ఈ ప్రపోజ్ చేయాలని భావించాడు. ఈ విషయాన్ని అతను మొట్టమొదటి సారిగా ఎంఎస్ ధోనీకి తెలియజేశాడు. ప్లేఆఫ్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి మ్యాచ్ ముగిసిన తరువాత ఈ ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నట్లు దీపక్ చాహర్.. ధోనికి చెప్పాడు.

దీనికి ధోని స్పందిస్తూ- ప్లే ఆఫ్స్ ముగిసేంత వరకూ జాప్యం చేయొద్దని సూచించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రపోజ్ చేయాలని దీపక్ చాహర్‌కు సలహా ఇచ్చాడని తెలుస్తోంది. ధోని సలహాను మరో మాట లేకుండా దీపక్ అంగీకరించాడని, మ్యాచ్ ముగిసిన వెంటనే జయ భరద్వాజ్‌కు ప్రపోజ్ చేశాడని చెబుతున్నారు. ధోనీది కూడా లవ్ మ్యారేజే. తన భార్య సాక్షిని అతను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. సాక్షి.. ధోనికి చిన్నప్పటి స్నేహితురాలు.

జయ భరద్వాజ్.. బిగ్‌బాస్ 5 హిందీ కంటెస్టెంట్. స్ప్లిట్స్ విల్లా రియాలిటీ షోలోనూ ఆమె కంటెస్ట్ చేశారు. సిద్ధార్థ్ భరద్వాజ్ చెల్లెలు ఆమె. స్వస్థలం ఢిల్లీ. ఓ కార్పొరేట్ కంపెనీని నడిపిస్తోన్నట్లు తెలుస్తోంది. దీపక్ చాహర్-జయ భరద్వాజ్ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. రెండు నెలలుగా డేటింగ్‌లోనూ ఉంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ బయో బబుల్‌లో ఉంటున్నారామె. జట్టు సభ్యులతో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లారు. తోటి క్రికెటర్ల కుటుంబం సభ్యులతో కలిసి అక్కడే ఉంటున్నారు.

Story first published: Friday, October 8, 2021, 10:13 [IST]
Other articles published on Oct 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+