ప్రాక్టీస్‌కు సిద్ధమైన ధోనీ.. షురూ ఎప్పటినుంచంటే!!

MS Dhoni to start training in Chennai from March 1 for IPL 2020

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్-13 తేదీలు ఖరారయ్యాయి. వచ్చేనెల 29న 13వ ఐపీఎల్‌కు తెరలేవనుంది. ఇక ప్రతీ ఫ్రాంచైజీ సీజన్-13 కోసం సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే రాయల్‌ చాలెంజర్స్​ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త లోగోతో ఈ సీజన్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతుండగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఆటగాళ్లు సురేష్ రైనా, అంబటి రాయుడు ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలెట్టారు. ఇక అందరి దృష్టి సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్ ధోనీపై నిలిచింది.

గతంలో ఏ క్రికెటర్‌ చేయని సాహసం.. విజయ్‌ శంకర్‌ నువ్ తోపురా (వీడియో)!!

సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ తన ప్రాక్టీస్‌కు రంగం సిద్ధం చేసుకున్నాడు. మార్చి 1వ తేదీ నుంచి చెన్నై చెపాక్‌ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్‌ను ఆరంభించనున్నాడు. జనవరిలో జార్ఖండ్‌ జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ చేసిన మహీ.. ఐపీఎల్‌ కోసం తన ప్రాక్టీస్‌ను మరింత ముమ్మరం చేయాలని చూస్తున్నాడు. మార్చి తొలి వారం నుంచి సీజన్‌ ఆరంభం అయ్యేవరకు ప్రాక్టీస్‌ కొనసాగించాలని మహీ భావిస్తున్నాడట. ధోనీతో రైనా, రాయుడులు కూడా ప్రాక్టీస్‌ చేయనున్నారు.

గత ఏడాది జూలై 9న న్యూజిలాండ్‌తో వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌ ఓటమి తర్వాత ధోనీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇక గతేడాది చివర నుండే పలుమార్లు అతడి రిటైర్మెంట్‌పై వార్తలొచ్చాయి. అయితే 38 ఏళ్ల మహీ తిరిగి టీమిండియాలోకి వచ్చేందుకు ఐపీఎల్‌ వేదికని అంతా భావిస్తున్న నేపథ్యంలో.. మార్చి ఒకటిన చెపాక్‌ స్టేడియంలో ఎంఎస్ ప్రాక్టీస్‌ ప్రారంబించనున్నాడు.

తాజాగా ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా స్పందించారు. ధోనీకి ఎంతో క్రికెట్‌ భవిష్యత్తు ఉందని, అయితే రిటైర్మెంట్‌పై మహీనే ఓ నిర్ణయానికి రావాలన్నారు. 'ధోనీ టీమిండియాకు ఎంతో సేవ చేసాడు. అతడు అద్భుతమైన ఆటగాడు. మహీకి ఎంతో క్రికెట్‌ భవిష్యత్తు ఉంది. కానీ.. ఎప్పుడు రిటైర్మెంట్‌ తీసుకోవాలో అతడే నిర్ణయించుకోవాలి. బీసీసీఐ విధానాల ప్రకారం రిటైర్మెంట్‌పై ఆటగాళ్లే నిర్ణయాలు తీసుకోవాలి' అని రాజీవ్‌ అన్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, February 17, 2020, 15:01 [IST]
Other articles published on Feb 17, 2020
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more