Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొత్త ఇన్నింగ్స్‌.. సైనిక విధుల్లోకి ధోనీ

MS Dhoni To Start Guard Duty In Kashmir As Honorary Lieutenant Colonel || Oneindia Telugu
MS Dhoni to start guard duty in Kashmir as honorary lieutenant colonel

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ బుధవారం నుండి కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంబించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రెండు నెలల విరామం ప్రకటించిన ధోనీ.. సైనిక విధుల్లో చేరనున్నాడు. భారత ఆర్మీలో పారాచ్యూట్‌ రెజిమెంట్‌లో గౌరవ కల్నల్‌గా ఉన్న ధోనీ సైనికుడిగా సేవలందించడం కోసం వెస్టిండీస్‌ పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

కశ్మీర్‌ లోయలో ఈ రోజు నుండి ధోని విధుల్లో పాల్గొంటాడు. విక్టర్‌ ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తూ ఆగస్టు 15 వరకు అక్కడే ఉండనున్నాడు. ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనే ఈ విక్టర్‌ ఫోర్స్‌ విభాగంలో పెట్రోలింగ్‌, గార్డ్‌, పోస్ట్‌ డ్యూటీ లాంటి బాధ్యతలు నిర్వర్తిస్తాడు. 'పారా రెజిమెంట్‌లో పని చేయడం కోసం ధోనీ సిద్ధమయ్యాడు. పారాచ్యూట్‌తో దూకడం లాంటి విన్యాసాలు కూడా చేశాడు' అని ఓ సైనిక అధికారి తెలిపాడు.

దేశ వ్యాప్తంగా పలు బ్రాండ్ల ద్వారా వందల కోట్టు అర్జించే ధోనీ.. సాధారణ సైనికుడిలా దేశం కోసం సేవ చేయడం యువతకు మార్గదర్శకంగా ఉంటుందని భారత ఆర్మీ పేర్కొంది. ధోనీని అభిమానించే యువత ఆర్మీలో చేరే అవకాశం ఉందని ఆర్మీ భావిస్తోంది. విండీస్ పర్యటన నుండి ధోనీ స్వయంగా తప్పుకోవడంతో.. యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ను వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేశారు. అయితే టెస్ట్‌లకు వృద్ధిమాన్‌ సాహాను ప్రత్యామ్నయ కీపర్‌గా ఎంపిక చేశారు.

Story first published: Wednesday, July 31, 2019, 16:46 [IST]
Other articles published on Jul 31, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+