రాత్రి 7 గంటలకు ప్రెస్ మీట్: ధోని రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా?

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం చేసిన ఓ ట్వీట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు తావిచ్చింది. సందర్భమేమీ లేకపోయినా 2016 టీ20 వరల్డ్‌కప్‌లో ధోనీతో కలిసి ఆడిన మ్యాచ్ గుర్తు చేసుకుంటూ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడనే ఊహాగానాలకు తెరలేపింది.
2016 వరల్డ్ టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించిన ఫోటోని కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం అభిమానులతో పంచుకున్నాడు. "ఆ మ్యాచ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మనిషి ఫిట్‌నెస్ టెస్ట్‌లో పరిగెత్తించినట్టు నన్ను పరిగెత్తించాడు" అంటూ ధోనీని ట్యాగ్ చేస్తూ విరాట్ కోహ్లీ కామెంట్ పెట్టాడు.
అంతేకాదు గురువారం రాత్రి 7 గంటలకు ధోని మీడియా సమావేశం నిర్వహించడానికి కూడా సిద్ధమయ్యాడంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే జట్టు మేనేజ్‌మెంట్‌కు తన నిర్ణయాన్ని చెప్పేశాడని... గురువారం తన నిర్ణయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ధోనీని రిటైర్మెంట్ ప్రకటించొద్దంటూ సోషల్ మీడియాలో అభిమానులు కోరుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆడి ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికితే బాగుంటుందనే సూచన నెటిజన్లు చేస్తున్నారు. ధోని అనుభవం ఇంకా జట్టుకు అవసరమని అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications