Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పి టీమిండియాపై ఫోకస్ పెట్టనున్న ధోనీ..?

MS Dhoni to retire from IPL and work with Team India

తన అసాధారణ నాయకత్వ లక్షణాలతో భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన సారధి మహేంద్ర సింగ్ ధోనీ. ఎవరైనా బ్యాటింగ్, బౌలింగ్‌తో ఫ్యాన్స్ సంపాదించుకుంటారు. కానీ ధోనీ వీటన్నింటి కన్నా తన కూల్ కెప్టెన్సీతోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ స్టార్ కెప్టెన్.. ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్పేందుకు సిద్ధం అవుతున్నాడట.

ధోనీ రిటైర్‌మెంట్..?

ధోనీ రిటైర్‌మెంట్..?

ఐపీఎల్‌ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ.. తన చుట్టూ బలమైన జట్టును నిర్మించాడు. ధోనీ అంటే సీఎస్‌కే, సీఎస్‌కే అంటే ధోనీ అనేలా అభిమానులను సంపాదించాడు. తన అభిమానుల ముందే తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడతానని మాటిచ్చిన ధోనీ.. ఈ ఏడాది ఐపీఎల్ మధ్యలో లేదా ఐపీఎల్ ముగియగానే ఆటకు వీడ్కోలు చెప్పనున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఫ్యూచర్ ఏంటి?

ఫ్యూచర్ ఏంటి?

ఐపీఎల్‌కు వీడ్కోలు పలికినంత మాత్రాన ధోనీ ఈ క్రీడకు దూరం అవుతాడని కాదు. అతన్ని భారత టీం మేనేజ్‌మెంట్‌లో భాగం చేయాలని బీసీసీఐ భావిస్తోందట. ఒక సెట్ ఆఫ్ ప్లేయర్స్‌తో ధోనీ కలిసి పనిచేస్తాడని తెలుస్తోంది. హార్దిక్, పంత్ తదితర ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా భారత జట్టుకు పొట్టి ఫార్మాట్‌లో కోచ్‌గా ధోనీని నియమించినా ఆశ్చర్యం లేదు.

గతేడాదే అన్నారు

అసలు గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌లోనే ధోనీ రిటైర్ అవుతాడని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే చెన్నై కెప్టెన్సీని కూడా ధోనీ వదులుకున్నాడు. రవీంద్ర జడేజాను తన వారసుడిగా ప్రకటించాడు. అయితే జడ్డూ కెప్టెన్సీలో జట్టు వరుసగా విఫలమవడంతో మళ్లీ పగ్గాలు అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెన్నైతో అభిమానుల ముందే తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడతానని మాటిచ్చాడు. వచ్చే ఏడాది చెన్నైలోనే తన రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.

Story first published: Tuesday, November 15, 2022, 14:03 [IST]
Other articles published on Nov 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+