న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తెరపైకి కొత్త వార్త: ధోని రిటైర్మెంట్ ఆలస్యానికి అసలు కారణం ఇదీ!

MS Dhoni to extend his career until T20 World Cup 2020 on Virat Kohlis request?

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ విషయం ఇప్పుడే ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఆగస్టు 3 నుంచి ఆరంభమయ్యే విండిస్ పర్యటనకు అందుబాటులో లేకుండా... భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను రెండు నెలలు పాటు ధోని క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్

ప్రస్తుతానికి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనని చెప్పిన ధోని.. భారత జట్టు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా యువ ఆటగాళ్లను సిద్ధం చేసుకోమని ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు ధోని స్పష్టం చేసినట్లు సోమవారం వార్తలు వైరల్ అయ్యాయి. ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓటమి అనంతరం ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జోరుగా సాగింది.

రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన ధోని

రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన ధోని

అయితే, ధోని మాత్రం తన రిటైర్మెంట్ వార్తలపై స్పందించకుండా విండీస్ టూర్‌కు అందుబాటులో ఉండనని ఎంపికకు ఒక్కరోజు ముందు సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు తెలిపాడు. దీంతో ధోనీ కోరిక మేరకు విండీస్ పర్యటన నుంచి తప్పించి యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు అవకాశం ఇచ్చినట్లు ఎమ్మెస్కే ప్రసాద్ మీడియా సమావేశంలో తెలిపాడు.

ధోని వెనుకడుగు వేయడానికి కారణం

ధోని వెనుకడుగు వేయడానికి కారణం

అయితే రిటైర్మెంట్‌ విషయంలో ధోని వెనుకడుగు వేయడానికి కారణం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీనేనని తాజాగా మరొక వార్త మంగళవారం హల్ చల్ చేస్తోంది. నిజానికి ప్రపంచకప్‌ అనంతరమే ధోని క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించినప్పటికీ... కెప్టెన్ విరాట్ కోహ్లీ విన్నపం మేరకు ఆగాడని కోహ్లీ సన్నిహితుడు ఒకరు మీడియాకు వెల్లడించాడు.

రిటైర్మెంట్‌ తీసుకోవద్దనే

రిటైర్మెంట్‌ తీసుకోవద్దనే

"ఇంత అత్యవసరంగా రిటైర్మెంట్‌ తీసుకోవద్దనే కోహ్లీ విన్నపంతోని ధోని తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ధోనికి ఎలాంటి ఫిట్‌నెస్‌ సమస్యల్లేవని, అతను 2020 టీ20 ప్రపంచకప్‌ వరకు కొనసాగగలడని కోహ్లీ భావిస్తున్నాడు. అదే సమయంలో వికెట్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌ను పూర్తి స్థాయిలో తయారు చేయాలని భావిస్తున్నారు" అని కోహ్లీ సన్నిహితుడు తెలిపాడు.

పంత్ వికెట్ కీపర్‌గా

పంత్ వికెట్ కీపర్‌గా

"పంత్ వికెట్ కీపర్‌గా సిద్ధమయ్యే వరకు... భారత జట్టులో మరో వికెట్ కీపర్ ఎంపిక చేసే ఆలోచనలో సెలక్టర్లు లేరు. అంతేకాదు రిషబ్ పంత్‌ గాయపడినా... ఫామ్‌ కోల్పోయినా.. ప్రత్యామ్నయంగా ధోని సేవలు అవసరమైనప్పుడు జట్టుకు ఉపయోగపడుతాడనే యోచనలో ఉన్నారు" అని కోహ్లీ భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

Story first published: Tuesday, July 23, 2019, 17:36 [IST]
Other articles published on Jul 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X