Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: రుతురాజ్ గైక్వాడ్‌కు షాక్! - మళ్లీ కెప్టెన్‌గా ధోనీ!!

CSK Dhoni: చెన్నై సూపర్ కింగ్స్‌కు మరోసారి ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశముందా? అంటే అవుననే హింట్ ఇచ్చాడు సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ. శనివారం చెపాక్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ధోనీ నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం అందింది. ఇంతకీ అతడికే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తున్నారు? అసలు ఏమైందో తెలుసుకుందాం..

ఎందుకు మళ్లీ ధోనీకి కెప్టెన్సీ?
సాధారణంగా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. అతడే జట్టును నడిపించాలి. అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ కుడి చేతి భుజానికి గాయం అయింది. టుషార్ దేశ్‌పాండే వేసిన బంతి అనూహ్యంగా ఎగిరి, అతడి చేతికి బలంగా తాకింది. దీంతో గైక్వాడ్ గాయపడ్డాడు. అయినప్పటికీ గైక్వాడ్ ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ ఆ తర్వాత నుంచి అతడు ప్రాక్టీస్ సెషన్లకు హాజరు కాలేదు. సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ మాట్లాడుతూ.. "గైక్వాడ్ ను మ్యాచ్‌కు అందుబాటులో ఉంచాలా లేదా అనే విషయాన్ని నెట్‌ సెషన్‌లో అతడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడో బట్టి నిర్ణయిస్తాం. అతడు ప్రస్తుతం కొంత నొప్పితో బాధపడుతున్నాడు. కానీ అతడి గాయం రోజురోజుకు కాస్త మెరుగవుతోంది. అతను ఆడతాడనే ఆశాభావంతో ఉన్నాం" అని అన్నాడు.

MS Dhoni to Captain Chennai super kings in CSK VS Delhi Capitals match IPL 2025

ఇప్పటికే చర్చించే ఉంటారు..
ఒకవేళ నిజంగానే గైక్వాడ్ ఆటకు అందుబాటులో లేకపోతే, సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశంపై ప్రస్తుతానికైతే సరైన స్పష్టత రాలేదు. దీనిపై హసీ మాట్లాడుతూ, "ఇంతవరకు ఈ విషయంపై మేం పెద్దగా ఆలోచించలేదు. గైక్వాడ్ అందుబాటులో లేకుంటే, ఎవరు కెప్టెన్‌గా వ్యవహరిస్తారో నాకు స్పష్టంగా తెలియదు. కానీ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, గైక్వాడ్ దీని గురించి చర్చించే ఉంటారు. మా జట్టులో మంచి యువ ఆటగాళ్లు ఉన్నారు. వికెట్‌కీపర్ అయిన ఒక వ్యక్తి ఈ బాధ్యతను తీసుకోవచ్చేమో. అతనికి ఈ బాధ్యతలు చేపట్టిన అనుభవం కూడా ఉంది. కానీ, కచ్చితంగా చెప్పలేను" అంటూ హస్సీ.. ధోనీ పేరు చెప్పకుండా కెప్టెన్సీ విషయంపై మాట్లాడాడు.

హస్సీ మాటలను బట్టి చూస్తే.. ధోనీ మళ్లీ నాయకత్వం వహించడానికి సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఐదుసార్లు సీఎస్కేకు ఐపీఎల్ టైటిల్స్ అందించిన ధోనీ, ఈ సీజన్‌లో వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా తన సత్తా చాటుతున్నాడు. కాబట్టి శనివారం జరిగే మ్యాచ్‌లో ధోనీ టాస్‌కు వెళ్లే అవకాశం ఉందని అంతా చర్చించుకుంటున్నారు. అలాగే సీఎస్కే ఫ్యాన్స్ కూడా తమ లెజెండరీ కెప్టెన్‌ను మళ్లీ నాయకుడిగా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Story first published: Friday, April 4, 2025, 20:35 [IST]
Other articles published on Apr 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+