Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ సినిమాకు సీక్వెల్ రానుందా..??

MS Dhoni: The Untold Story sequel is coming- Sushant Singh Rajput starrer to feature T20I win, 2015 World Cup

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. జీవితమే కాదు. జీవితాన్ని సినిమా తీసినా హిట్ అయి కూర్చుంది. అతను పడిన కష్టాలు.. సక్సెస్‌ఫుల్‌‌గా ఎదిగిన తీరు సినిమాలో చూపించడంతో.. అందరినీ కట్టిపడేసింది. ఈ సినిమాలో ధోనీ పాత్రలో ఒదిగిపోయిన సుషాంత్ సింగ్ రాజ్‌పుత్.. ధోనీ క్రికెట్‌లో సాధించిన స్టార్ డమ్.. సినిమాల్లో అతనూ సంపాదించాడు. బాలీవుడ్‌లో ఈ సినిమాతో అందరికీ గుర్తుండిపోయే నటుడిగా ఎదిగిపోయాడు.

దీంతో ఎమ్మెస్ ధోనీ: అన్‌టోల్డ్ స్టోరీకి సీక్వెల్ తీయాలన్న ఆలోచనలో సుషాంత్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని తెరకెక్కించడానికి రోనీ స్క్రూవాలా ప్రొడక్షన్ హౌజ్ సిద్ధంగా ఉంది. ధోనీ 2.0లో 2011 వరల్డ్‌కప్ తర్వాత సాధించిన సక్సెస్‌ను చూపించాలని భావిస్తున్నారు. టీ20ల్లో ధోనీ సాధించిన ఘనతలతోపాటు వ్యక్తిగత జీవితంలోని ప్రధాన అంశాలను ఈ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

2013లో కాయ్ పొ చె సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సుషాంత్.. తర్వాత శుద్ధ్ దేశీ రొమాన్స్‌లాంటి సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. 2014లో వచ్చిన పీకేలో ఓ గెస్ట్ రోల్‌లో కనిపించాడు. 2016లో వచ్చిన ధోనీ మూవీతోనే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత వచ్చిన రాబ్తా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో మరోసారి అతను ధోనీ సీక్వెల్‌పై సీరియస్‌గా ఆలోచిస్తున్నాడు.

అయితే ఇప్పటికే టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. టీ20ల్లో అద్భుతమైన ఫామ్‌తో రాణిస్తున్నాడు. కొద్ది నెలల ముందే ముగిసిన ఐపీఎల్‌లోనూ అదే ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ధోనీ..అన్ టోల్డ్ స్టోరీ అని వచ్చిన సినిమాలో ప్రపంచ కప్‌తో ముగింపునిచ్చిన దర్శకుడు ఈ సీక్వెల్‌లో ఎక్కడితో ముగిస్తారో చూడాల్సిందే..!!

Story first published: Wednesday, July 4, 2018, 17:07 [IST]
Other articles published on Jul 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+