Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ గురించి చెప్పండి: అభిమాని ప్రశ్నకు కైప్ జవాబు ఇదీ

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని.. భారత జట్టులోనే కాదు ప్రపంచ క్రికెట్‌లో కూడా కూలెస్ట్ క్రికెటర్. కెప్టెన్‌గా కూల్‌గా ఉంటూనే టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించాడు. ఏ భారత కెప్టెన్‌కు సాధ్యంకాని రికార్డులను సైతం సృష్టించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీసీ నిర్వహించే మూడు ప్రధాన టోర్నీలైన ఐసీసీ వరల్డ్ టీ20, ఐసీసీ వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోపీలను ధోని నేతృత్వంలోనే భారత్ సొంతం చేసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్‌ కైఫ్‌ ట్విట్టర్‌లో 'ఆస్క్‌ కైఫ్‌' పేరుతో అభిమానులతో కొన్ని విషయాలు పంచుకున్నాడు.

MS Dhoni the coolest cricketer one can ever know: Mohammad Kaif

ఈ సందర్భంలోనే ఓ అభిమాని 'మహేంద్ర సింగ్‌ ధోనీ గురించి కొన్ని మాటల్లో చెప్పండి' అని అడగ్గా కైఫ్‌ ఏమన్నాడంటే 'అందరికీ తెలిసిన శాంత స్వభావి..' అని కైఫ్‌ బదులిచ్చాడు. ఎన్నో ఉత్కంఠ భరిత మ్యాచ్‌ల్లో ధోని ఎంతో ప్రశాంత ఉంటూ ఎన్నో విజయాలను భారత్‌కు అందించాడు.

ఇక, మహ్మద్‌ కైఫ్‌ 2002లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్లో మెరుపులు అద్భుతం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్‌ లాగే మహ్మద్ కైఫ్‌ సైతం సామాజిక మాధ్యమాల్లో చురగ్గా ఉంటాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+