అభిమానులకు ధన్యవాదాలు: సుదీర్ఘ నిరీక్షణపై ధోని
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ కోసం మా సుదీర్ఘ నిరీక్షణ ముగిసిందని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆ జట్టు రెండేళ్ల పాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.
తాజాగా ఆ జట్టుపై నిషేధం ముగియడంతో చెన్నై ఫ్రాంచైజీ ఇటీవల అధికారిక ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఐపీఎల్‌లో చెన్నై జట్టుకి కెప్టెన్‌గా ఉన్న ధోని 7వ నెంబర్ కలిగి ఉన్న జెర్సీపై 'తలా' అని రాసిన టీషర్ట్‌ని ధరించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

ధోని పోస్టుకి విపరీతమైన స్పందన
ఈ పోస్టుకి విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా చెన్నై జట్టు పట్ల అభిమానులు చూసిన ప్రేమాభిమానులకు ధోని సంతోషపడ్డాడు. తన పట్ల చూపించిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపాడు. శనివారం ప్రారంభమైన తమిళనాడు ప్రీమియర్ లీగ్ ప్రారంభ కార్యక్రమంలో కూడా ధోని చెన్నై సూపర్ కింగ్స్‌ను గుర్తు చేస్తూ ఎల్లో కలర్ టీషర్ట్ ధరించి వచ్చాడు.

అభిమానుల ఉత్సాహం అద్భుతంగా ఉంది
ఈ సందర్భంగా ధోని మీడియాతో మాట్లాడాడు. 'ఇది చాలా మంచి సందర్భం. అభిమానుల ఉత్సాహం అద్భుతంగా ఉంది. నామీద లెక్కలేనంత ప్రేమ, అభిమానం చూపించారు. చెన్నై నా రెండో ఇళ్లని ఇది వరకే చాలా సార్లు చెప్పాను. ఎల్లో జెర్సీలో మరింత రాణిస్తాం. చెన్నై సూపర్ కింగ్స్ కోసం మా సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. వచ్చే ఏడాది మేం ఇక్కడ ఆడుతుంటే మీరంతా సంతోషంగా చూస్తారు' అని అన్నాడు.

రెండేళ్లు చెన్నై తరపున ఆడలేదు
ఇక చెన్నై జట్టుపై అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ముగ్ధుడుని అయ్యాయని ధోని చెప్పుకొచ్చాడు. 'మేము ఇక్కడ రెండేళ్లు చెన్నై తరపున ఆడలేదు, కానీ మా అభిమానుల సంఖ్య మాత్రం గత రెండు సంవత్సరాలలో పెరిగింది. అభిమానులు మాతోనే ఉన్నారు. వారి ప్రేమ అభిమానం ఎల్లప్పుడూ మాతోనే ఉంది' అని ధోని పేర్కొన్నాడు.

చెపాక్‌లో ధోనికి తీపి గుర్తులు
ఇక వచ్చే ఏడాది ఐపీఎల్‌లో చెన్నై ఇక్కడ మొదటి ఆటను ఆడటానికి వచ్చినప్పుడు ఆ అభిమానం మరింత పెరుగుతుందని ధోని ఆశాభావం వ్యక్తం చేశాడు. చెన్నై ధోనికి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ధోని ఇదే స్టేడియంలో డబుల్ సెంచరీ చేశాడు. ఇదిలా ఉంటే ధోనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి సిద్ధంగా లేమని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఇదివరకే ప్రకటించింన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications