గోల్ చేసిన ధోని: 90 నిమిషాలు బంతి వెంట పరుగు
న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి పుట్‌బాల్ పట్ల అమితాసక్తి ఉన్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ వన్డే సిరిస్ తర్వాత జింబాబ్వే పర్యటనకు సీనియర్లకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల విరామం అనంతరం ధోని మైదానంలోకి అడుగుపెట్టాడు.
అయితే ఇక్కడ ధోని ఆడింది క్రికెట్ ఆట కాదు, పుట్ బాల్. విరామం అనంతరం, శరీరం ఎలా సహకరిస్తుందో తెలుసుకునేందుకే తాను పుట్‌బాల్ ఆడినట్లు ధోని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. పుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే ధోని, వీలు చిక్కినప్పుడల్లా ఆడుతుంటాడు.

తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో సిల్లి స్టేడియంలో జరిగిన సాకర్ మ్యాచ్‌లో ధోనీ 90 నిమిషాల పాటు బంతి వెంట పరుగులు తీసి అభిమానులను సంతోషపెట్టాడు. అంతే కాదండయ్ ఈ మ్యాచ్‌లో ధోని ఒక గోల్ కూడా చేశాడు. ధోని స్నేహితుడు సుదేశ్ ఆహ్వానం మేరకే ఈ సాకర్ గేమ్‌లో ఆడినట్లు పేర్కొన్నాడు.
గత నెలరోజులుగా విశ్రాంతి తీసుకుంటన్న ధోని, సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపేందుకే ప్రయత్నిస్తున్నానని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications