Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా 139 ఏళ్ల రికార్డును తిరగరాసిన ధోనీ

సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై ఆస్టేలియాను క్లీన్ స్విప్ చేసిన భారత కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని రికార్డు సృష్టించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. దీంతో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్‌గా ధోని అవుట్ డేటెడ్ అయ్యాడని అతన్ని కొనసాగించడం జట్టు బలహీనతకు కారణమవుతోందని ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ విమర్శించాడు.

MS Dhoni and Team India create history with 3-0 whitewash in Sydney

కానీ పడిలేచిన కెరటంలా ఆస్టేలియా గడ్డపై కంగారూలను వైట్ వాష్ చేసిన నాయకుడిగా ధోని చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై పర్యాటక జట్టు ఆ దేశ జట్టుపై ఏ ఫార్మాట్‌లోనైనా వరుసగా మూడు మ్యాచ్‌లలో విజయం సాధించి టైటిల్ దక్కించుకున్న ఘటన 139 ఏళ్ల క్రితం జరిగిందట.

తాజాగా ఆ రికార్డును బద్దలుకొడుతూ ధోనీ వరుసగా మూడు మ్యాచ్‌లలో కంగారూలపై విజయం సాధించి 139 ఏళ్ల నాటి రికార్డును తిరగరాశాడు. ఆస్టేలియా నిర్దేశించిన 198 పరగులు భారీ లక్ష్యాన్ని భారత్ మూడు రోహిత్, కోహ్లీ, రైనా, యూవీలు రాణించడంతో చివరి బంతికి భారత్ విజయం సాధించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+