
హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, ప్రపంచ కప్ విజేత మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2017 జనవరి 10 నుంచి ధోనీ ఏ జట్టుకు నాయకత్వం వహించట్లేదు. చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న ధోనీ తాజాగా స్పందించాడు. శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఇలా మాట్లాడాడు.
'నేను భారత జట్టుకు కెప్టెన్ కాకముందు ఏ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించలేదు. ఇప్పుడు కెప్టెన్సీ అంటే భయం లేదు. ఇంకో విషయం ఏమంటే వికెట్ కీపర్ ఎప్పుడూ వైస్ కెప్టెన్‌గానే ఉంటాడు. అని జట్టు ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడాడు. వికెట్ కీపర్ గా ఉన్నవాడు బ్యాట్స్‌మెన్ ఆటతీరును చాలా దగ్గర్నుంచి గమనిస్తాడు. ఇలానే చాలా మంది వికెట్ కీపర్‌లే ఇంతకుముందు చాలా సందర్భాల్లో కెప్టెన్‌లు అయ్యారు.' అని పేర్కొన్నాడు.
'వేలంలో అశ్విన్‌ను తప్పక దక్కించుకుంటాం. అతడు లోకల్ ప్లేయర్. చెన్నై సూపర్ కింగ్స్‌లో ఎక్కువ మంది లోకల్ ప్లేయర్లు ఉండాలని కోరుకుంటున్నా. వీరితో పాటు చెన్నై జట్టు మాజీ ఆటగాళ్లు బ్రెండన్ మెక్‌కల్లమ్, డుప్లెసిస్, డ్వేన్ బ్రావోలను కూడా వేలంలో కోనుగోలు చేస్తాం. ప్రస్తుతం మా వద్ద రెండు రైట్ టు మ్యాచ్ కార్డులు ఉన్నాయి. వాటిని ఎప్పుడు ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలుసు' అని ధోని అన్నాడు. ఈ మెగా సంబరానికి ఎనిమిది జట్లు సన్నద్దమవుతున్నాయి. బెంగుళూరులో జనవరి 27,28న జరగనున్న ఈ వేలంలో ఏ జట్టుకు ఎవరు ఆడతారో తేలనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.