Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చిన్నారికి ధోని సర్‌ప్రైజ్: షేక్ హ్యాండ్ ఇచ్చి కుశల ప్రశ్నలు (వీడియో)

Dhoni Makes It As A Memorable Day For Young Fan | Oneindia Telugu
MS Dhoni takes a young fan by surprise with a ‘warm handshake’

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ పేరు వింటే చాలు అభిమానులు ఉత్సాహాంతో ఊగిపోతారు. అంతేకాదు ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తిరువనంతపురం వేదికగా ఐదో వన్డే జరిగింది.

35 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసిన ధోని అభిమానులు

35 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసిన ధోని అభిమానులు

ఈ వన్డేకి ముందు తిరువనంతపురం చేరుకున్న ధోనికి అక్కడి అభిమానులు 35 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి ధోని పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మ్యాచ్‌ జరిగిన గ్రీన్ ఫీల్డ్ స్టేడియం ఎదుట ధోని 35అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులతో పంచుకుంది.

అభిమానుల గుండెల్లో తాను ఎల్లప్పుడూ ప్రత్యేకమే

అభిమానుల గుండెల్లో తాను ఎల్లప్పుడూ ప్రత్యేకమే

అయితే, ఈ మధ్య కాలంలో ధోని ప్రదర్శన అభిమానులను నిరాశపరుస్తోంది. అయినా సరే ధోని పట్ల అభిమానులకు ఉన్న అభిమానం మాటల్లో చెప్పలేనిది. మరోవైపు అభిమానుల గుండెల్లో తాను ఎల్లప్పుడూ ప్రత్యేకమే అని తాజాగా మరోసారి నిరూపించుకున్నాడు. ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తున్న ధోనికి ఓ చిన్నారి అభిమాని తారసపడ్డాడు.

చిన్నారితో సరాదాగా ముచ్చటించిన ధోని

ఈ క్రమంలో ఆ చిన్నారితో ధోని కాసేపు సరదాగా ముచ్చటించాడు. అంతేకాదు ఆ చిన్నారికి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నవంబర్ 21 నుంచి ఆసీస్‌‌తో జరిగే టీ20 సిరిస్‌లో తలపడనుంది.

నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరిస్ ప్రారంభం

నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరిస్ ప్రారంభం

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. ఇప్పటికే టెస్టులకు వీడ్కోలు పలికిన ధోనిని ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు టీ20ల సిరిస్ నుంచి సెలక్టర్లు తప్పించారు. అతడి స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి చోటు కల్పించారు.

Story first published: Wednesday, November 14, 2018, 12:14 [IST]
Other articles published on Nov 14, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+