న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ.. రిటైర్‌మెంట్ ప్రకటించేందుకే బాల్ తీసుకున్నాడా..?? (వీడియో)

Dhoni Takes ODI Match Ball From Umpire,Sparks Conjectures about Retirement
MS Dhoni Takes ODI Match Ball From Umpire, Sparks Conjectures About Retirement

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పనున్నాడనే సందేహాలు నెలకొన్నాయి. వన్డే సిరీస్‌లోని ఆఖరి మ్యాచ్ లీడ్స్ వేదికగా మంగళవారం జరిగింది. ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఫీల్డ్ అంపైర్ల చేతి నుంచి బంతిని తీసుకోవడంపై సోషల్ మీడియా వేదికగా సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

సాధారణంగా ఏదైనా సిరీస్‌ను సొంతం చేసుకుంటే క్రికెటర్లు వికెట్లను, మ్యాచ్‌ బాల్‌ను విజయానికి గుర్తుగా తీసుకుంటారు. ఇది సర్వ సాధారణమే. కానీ, మంగళవారం ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు ఆటగాళ్లు రూట్‌, మోర్గాన్‌ ధాటికి భారత్‌ 8 వికెట్ల తేడాతో మ్యాచ్‌ ఓటమితో పాటు మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో చేజార్చుకుంది.

1
42373

మైదానాన్ని వీడి వెళ్లే సమయంలో ఫీల్డ్‌ అంపైర్ల:

ఇంగ్లాండ్‌తో చివరి వన్డే అనంతరం ధోనీ మైదానాన్ని వీడి వెళ్లే సమయంలో ఫీల్డ్‌ అంపైర్ల నుంచి మ్యాచ్‌ బాల్‌ను అడిగి తీసుకున్నాడు. ఎవరైనా గెలిచిన మ్యాచ్‌లో గుర్తుగా ఇలా తీసుకుంటారు కానీ ధోనీ ఓడిన మ్యాచ్‌లో బంతిని తీసుకోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

టెస్టులకు వీడ్కోలు పలికే సమయంలోనూ

టెస్టులకు వీడ్కోలు పలికే సమయంలోనూ ధోనీ ఇలాగే వికెట్లపై ఉండే బైల్స్‌ను తీసుకున్నాడు. తాజాగా అంపైర్ల నుంచి బంతిని తీసుకోవడంతో అభిమానుల మదిలో ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడేమోనన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇంగ్లాండ్‌తో లార్డ్స్, లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో ధోనీ ఆటతీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. పరుగులు రాబట్టాల్సిన సమయంలో ధోనీ పరుగులేమీ చేయకపోవడంతో అభిమానులు, క్రీడా విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే.

భారత్‌కు భిన్నంగా ఇన్నింగ్స్‌ ఆరంభించి

టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్‌ జట్టు.. భారత్‌కు భిన్నంగా ఇన్నింగ్స్‌ ఆరంభించింది. భారత బ్యాట్స్‌మెన్‌ ఇబ్బందిపడ్డ అదే పిచ్‌పై ఈ ఇద్దరూ సాధికారికంగా ఆడారు. క్రమం తప్పకుండా సింగిల్స్‌ తీస్తూ, వీలైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్వేచ్ఛగా సాగిపోయారు. స్పిన్నర్లు కుల్‌దీప్‌, చాహల్‌ కూడా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టలేకపోయారు. చాహల్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసినా వికెట్‌ పడగొట్టలేకపోయాడు. స్పిన్నర్లతోపాటు ప్రధాన పేసర్‌ భువనేశ్వర్‌ కూడా విఫలం కావడంతో ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడం భారత్‌కు కష్టమైపోయింది.

కెప్టెన్ మోర్గాన్.. సమయోచిత ఇన్నింగ్స్‌తో:

మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి (71: 72 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం 44.3 ఓవర్లలోనే 260/2తో ఛేదించేసింది. జో రూట్ (100 నాటౌట్: 120 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (88 నాటౌట్: 108 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సు) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆ జట్టుని విజయతీరాలకి చేర్చాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ భారత్ పేలవరీతిలో విఫలమైంది.

Story first published: Wednesday, July 18, 2018, 12:33 [IST]
Other articles published on Jul 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X