న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనికి డ్యాన్స్ టిప్స్ నేర్పించిన జీవా (వీడియో)

MS Dhoni takes dancing tips from Ziva, shares adorable video with daughter - Watch

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తనకు లభించిన విరామాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ముఖ్యంగా తన విలువైన సమయాన్ని కుమార్తె జీవాతో కలిసి సందడి చేస్తున్నాడు. జీవాతో తనకున్న సరదా ఘటనలను ఎప్పటికప్పుడు ధోని అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.

జీవాకు సంబంధించిన వీడియోని

జీవాకు సంబంధించిన వీడియోని

తాజాగా జీవాకు సంబంధించిన వీడియోని ధోని తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియోలో జీవా కొరియోగ్రాఫర్‌గా మారగా ధోని డ్యాన్స్ నేర్చుకున్నాడు. "మేం డ్యాన్స్‌ వేస్తున్నప్పుడు కూడా బాగానే ఉంది" అనే కామెంట్‌తో ధోని వీడియోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు.

జీవా స్టెప్పులేసి ధోనీ

ఓ ఇంగ్లిష్ పాటకు జీవా స్టెప్పులేసి ధోనీని కూడా వేయమని చెప్పడం ఆ వీడియోలో అభిమానులను ఆకట్టుకుంది. జీవా ఎలాగైతే డ్యాన్స్ చేసిందో అచ్చం ఆమెను అనుకరిస్తూ ధోని డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను షేర్‌ చేసిన కొద్ది సేపటికే లక్షల్లో లైకులొచ్చాయి. ఇప్పటి వరకూ ఈ వీడియోను 25.3లక్షలమందికి పైగా వీక్షించారు.

కొరియోగ్రాఫర్‌ అవతారమెత్తిన జీవా

కొరియోగ్రాఫర్‌ అవతారమెత్తిన జీవా

ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "జీవా అప్పుడే కొరియోగ్రాఫర్‌ అవతారమెత్తింది" అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టగా, మరొక నెటిజన్ "డ్యాన్సర్‌గా ధోనీ కొత్త ఇన్నింగ్స్‌లోకి అడుగుపెట్టినందుకు శుభాకాంక్షలు" అని కామెంట్లు పెడుతున్నారు.

 డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్టు

డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్టు

2014లోనే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని 2017 జనవరిలో వన్డే, టీ20 కెప్టెన్సీకి కూడా వీడ్కోలు పలికాడు. దీంతో ధోని వారసుడిగా బీసీసీఐ విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా డిసెంబరు 6న ఆడిలైడ్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.

Story first published: Monday, December 3, 2018, 14:04 [IST]
Other articles published on Dec 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X