సర్‌ప్రైజ్: జమ్మూ కాశ్మీర్ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లో ధోని
హైదరాబాద్: దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే టోర్నీలో ధోనీ నేతృత్వంలోని జార్ఖండ్ జట్టు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో జార్ఖండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జమ్మూ కాశ్మీర్ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లారు. వారితో కొంత సమయం గడిపారు. క్రికెట్‌కు సంబంధించిన కొన్ని సూచనలను చేశారు.
కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలోని వాంఖడె స్టేడియంలో రంజీ ట్రోఫీ మ్యాచ్ అనంతరం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా ఇదే విధంగా జమ్మూ కాశ్మీర్ ఆటగాళ్లకు క్రికెట్‌కు సంబంధించి కొన్ని సూచనలు చేశారు.
ఇటీవలే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న టీ20 స్పెషలిస్ట్, జమ్మూ కాశ్మీర్ కెప్టెన్ పర్వేజ్ రసూల్ సూచన మేరకు ధోని జమ్మూ కాశ్మీర్ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌కు రావడం జరిగింది. 15 నిమిషాల పాటు ధోని జమ్మూ ఆటగాళ్లతో గడిపారు.

ధోని నుంచి కీలక సూచనలు
ఈ సందర్భంగా పర్వేజ్ రసూల్ మాట్లాడుతూ క్రికెట్‌కు సంబంధించిన సూచనలు చెప్పడంతో మహిభాయ్ ఎల్లప్పుడూ ముందుంటాడని పేర్కొన్నారు. అది అతని నైజం. ధోని నుంచి క్రికెట్ విషయాలను నేర్చుకోవడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నామని చెప్పాడు.

43 ఓవర్లలో 184 పరుగులు చేసిన జమ్మూ కాశ్మీర్
ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కాశ్మీర్ జట్టు 43 ఓవర్లలో 184 పరుగులు చేసింది. ఒవైస్ షా (59), కెప్టెన్ పర్వేజ్ రసూల్ (45) రాణించారు. జార్ఖండ్ బౌలర్లలో నదీమ్ 5, కౌషల్ సింగ్ 2 వికెట్లు తీశారు.

35 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించిన జార్ఖండ్
అనంతరం 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్ 35 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి నిర్దేశిత లక్ష్యాన్ని అందుకుంది. కుమార్ దేవబ్రత్ 94 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 78 పరుగులతో రాణించగా, కెప్టెన్ ధోని 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

హైదరాబాద్ ఓటమి జార్ఖండ్‌కు కలిసొచ్చింది
మరోవైపు చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్... సర్వీసెస్ చేతిలో ఓడిపోవడం జార్ఖండ్‌కు కలిసొచ్చింది. గ్రూప్ ‘డి'లో హైదరాబాద్, జార్ఖండ్ 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... మెరుగైన రన్‌రేట్‌తో జార్ఖండ్ క్వార్టర్స్ బెర్తు ఖరారైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications