For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రికార్డ్‌లు: కెప్టెన్‌గా... ధోనీకి 'పరుగుల' చేదు, తీపి

By Srinivas

బెంగళూరు: భారత ట్వంటీ 20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వెయ్యి పరుగుల జాబితాలో చేరాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బంగ్లాదేశ్‌తో ఉత్కంఠ జరిగిన మ్యాచ్‌లో భారత్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది.

ఈ మ్యాచ్‌లో ధోనీ 13 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా ట్వంటీ 20ల్లో వెయ్యి పరుగులు చేసిన అయిదో భారత క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు. భారత్, పాకిస్తాన్ జట్లలో చెరో ఐదుగురు ఆటగాళ్లు వెయ్యి పరుగులు పూర్తి చేసిన వారిలో ఉన్నారు.

ధోనీకి చేదు, తీపి

- వెయ్యి పరుగులు చేసిన తొలి కెప్టెన్‌గా ధోనీ రికార్డ్ సాధించాడు.

- కుమార సంగక్కర, బ్రెండన్ మెకల్లమ్, మొహమ్మద్ షహజాద్ తర్వాత.. వెయ్యి పరుగులు చేసిన నాలుగో వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ.

MS Dhoni surpasses numerous landmarks in India's one run win over Bangladesh

- యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీల తర్వాత.. అన్ని ఫార్మాట్లలో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ప్రస్తుత ఆటగాళ్లలో ధోనీ ఉన్నాడు.

- బంగ్లాతో నిన్న జరిగిన ఆటలో భారత్ చివరి 5 ఓవర్లలో (16వ ఓవర్ నుంచి 20వ ఓవర్ మధ్య) 34 పరుగులు చేసింది. ఇదే వరస్ట్ రికార్డ్. గతంలో 2014లో మీర్పూర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 16 నుంచి 20 ఓవర్ల మధ్య వచ్చిన పరుగులు 35. ఇప్పుడు అంతకంటే ఓ పరుగు తక్కువగా వచ్చింది.

- ఈసారి పవర్ ప్లేలో రవిచంద్రన్ అశ్విన్ 16 వికెట్లు తీశాడు. శామ్యూల్ బాడ్రీ 19 వికెట్లు తీశాడు. శామ్యాల్ తర్వాత అశ్విన్ ఉన్నాడు.

- గత రెండు ట్వంటీ 20ల్లో ఆశిష్ నెహ్రా పవర్ ప్లేలో వికెట్ తీయడం లేదు. అంతకుముందు 9 ట్వంటీ 20ల్లో 11 వికెట్లు తీశాడు. కనీసం ప్రతి మ్యాచులో ఒక వికెట్ తీశాడు.

- ట్వంటీ 20లో 3వేల పరుగులు చేసిన రెండో బంగ్లా ఆటగాడు షకీబ్ అల్ హసన్. అంతకుముందు తమీమ్ ఇక్బాల్ 3000 పరుగులు చేశాడు. మూడువేల పరుగులు చేసేందుకు షకీబ్ 185 మ్యాచులు, 172 ఇన్నింగ్స్ ఆడాడు.

MS Dhoni surpasses numerous landmarks in India's one run win over Bangladesh

- ఇప్పటి వరకు ఈ ఏడాది ట్వంటీ 20 ప్రపంచ కప్ మ్యాచుల్లో ఇరవై వికెట్లు తీసిన వారిలో అశ్విన్, ఆల్ అమిన్ హోసేన్, షకీబ్ ఉన్నారు. అందరూ 20 వికెట్లతో ఉన్నారు.

- బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో మ్యాన్ ఆప్ ది మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్‌ను వరించింది. ఇది ఇతనికి నాలుగోది. అజంత మెండిస్ ఐదుసార్లు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అందుకున్నాడు.

- 16 నుంచి 20 ఓవర్ల మధ్య బంగ్లాదేశ్ 40 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం నిన్నటి మ్యాచుతో అయిదోసారి. అంతేకాదు, ప్రతిసారి వారు ఓడిపోయారు.

- టెస్ట్ మ్యాచులు ఆడే జట్లతో బంగ్లాదేశ్ ఇప్పటి దాకా గెలవలేదు. 2007లో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో మాత్రమే వెస్టిండీస్ పైన గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి దాకా 16 మ్యాచులు టెస్ట్ జట్ల పైన ఆడింది. కానీ గెలవలేదు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+