కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై: ఎందుకీ అనూహ్య నిర్ణయం?
హైదరాబాద్: భారత క్రికెట్‌లో ఓ అధ్యాయం ముగిసింది. దేశ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అందరి మన్ననలు అందుకున్న మహేంద్రసింగ్ ధోనీ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా సిరీస్‌లో అనూహ్యంగా టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన 35 ఏళ్ల ధోనీ తాజాగా పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి కూడా వీడ్కోలు పలికాడు.
ధోని కెప్టెన్సీ వీడ్కోలు నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేసింది. అసలు ఈ అనూహ్య నిర్ణయానికి గల కారణమేమిటనేది అభిమానుల మదిలో మెదలుతున్న ప్రశ్న. అయితే ఇందుకు రకరకాల కారణాలున్నాయన్నాని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఒకటి టెస్టులకు దూరమైన తర్వాత ధోని కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కే పరిమితమయ్యాడు. దీంతో క్రికెట్ రేసులో వెనుకబడ్డాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన రెండున్నర నెలల తర్వాత గానీ తర్వలో ఇంగ్లాండ్‌తో జరగబోయే టీ20, వన్డే సిరిస్ ద్వారా ధోని అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు.

ధోని విషయంలో జాతీయ సెలెక్టర్లు అసంతృప్తి
ఇంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉండి మళ్లీ ఆడటమనేది ఇబ్బంది గాకపోయినా జాతీయ సెలెక్టర్లు మాత్రం ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ప్రపంచంలోనే గొప్ప మ్యాచ్ ఫినిషర్‌గా ప్రశంసలు అందుకున్న ధోని ఈ మధ్య కాలంలో ఆస్థాయి మేరకు రాణించలేకపోతున్నాడు.

అవకాశాల కోసం యువ క్రికెటర్లు ఎదురుచూపులు
మరోవైపు లోకేశ్ రాహుల్, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ లాంటి యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అవకాశాలకు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌ల కంటే టెస్టు సిరిస్‌లే ఎక్కువగా ఆడనుంది.

ఎమ్మెస్కేతో ప్రసాద్‌తో సుదీర్ఘంగా చర్చించి
ఇప్పుడు గనుక తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించకపోతే అది మరింతగా ఆలస్యమయ్యే ప్రమాదముంది. దీంతో తన వీడ్కోలు నిర్ణయాన్ని రంజీ సెమీస్ సందర్భంగా సెలెక్షన్ కమిటీ చైర్మన్ ప్రసాద్‌తో ధోనీ సుధీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది.

ఒకరోజులో తీసుకున్న నిర్ణయం కాదు: అరుణ్ పాండే
ధోనీ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచినా ఇది ఒకరోజులో తీసుకున్న నిర్ణయం కాదని ధోని ఆప్తమిత్రుడు, అతడి వాణిజ్య వ్యవహారాలు చూసే అరుణ్ పాండే చెప్పాడు. ‘రాత్రికి రాత్రే ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. ఎంతో ఆలోచించిందే. కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పి.. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగాలనుకోవడానికి ఇదే సమయమని మహీ భావించాడ'ని పాండే తెలిపాడు.

గంగూలీ ఇటీవల చేసిన వ్యాఖ్యలతోనే
అన్ని ఫార్మాట్లకు కోహ్లీని కెప్టెన్‌గా చేయాలని గంగూలీ ఇటీవల చేసిన వ్యాఖ్యల కారణంగా ధోనీ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడా? అని అడిగితే ధోని ఇలాంటివేమీ పట్టించుకోడని పాండే వ్యంగ్యంగా చెప్పాడు. భారత్‌కు ఆడుతున్న కొంత మంది ఆటగాళ్లు ధోనీ కెప్టెన్సీలోనే పెరిగి పెద్దయ్యారని అయితే జట్టు విస్తృత ప్రయోజనాల రీత్యా తప్పుకోవడం ఉత్తమమని ధోని భావించాడని అరుణ్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications