న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్ పర్యటనలో సచిన్‌ రికార్డుకు చేరువలో ధోని

India vs Australia : M S Dhoni Resembles Sachin Tendulkar In Score | Oneindia Telugu
MS Dhoni stands on verge of breaking Sachin Tendulkars record in New Zealand after Australia heroics

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై ముగిసిన మూడు వన్డేల్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని... న్యూజిలాండ్‌లో మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో కూడా ధోని ఇదే ఫామ్‌ని కొనసాగించగలిగితే ఐదు వన్డేల ఈ సిరీస్‌లో ఆ రికార్డును ధోనీ తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

గౌరవం పెరిగింది: ఫెదరర్‌ను అడ్డుకున్న సెక్యూరిటీ ఆఫీసర్‌కు సచిన్ ప్రశంసగౌరవం పెరిగింది: ఫెదరర్‌ను అడ్డుకున్న సెక్యూరిటీ ఆఫీసర్‌కు సచిన్ ప్రశంస

కివీస్ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 18 మ్యాచ్‌ల్లో 652 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్‌ ఉన్నాడు. సెహ్వాగ్ 12 మ్యాచ్‌లాడి 598 పరుగులు చేశాడు. ఈ జాబితాలో 455 పరుగులతో ధోని మూడో స్థానంలో ఉన్నాడు.

ధోని మరో 197 పరుగులు చేస్తే

ధోని మరో 197 పరుగులు చేస్తే

సచిన్‌ను అధిగమించి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచేందుకు గాను ధోని మరో 197 పరుగులు చేయాల్సి ఉంది. 2018లో పేలవ ప్రదర్శన కనబర్చిన ధోని, 2019ని మాత్రం అద్భుతంగా ప్రారంభించాడు. గతేడాది 20 ఇన్నింగ్స్‌లో కేవలం 275 పరుగులు చేసిన ధోని, ఈ ఏడాది ఆడిన మూడు వన్డేల్లోనే 193 పరుగులు చేశాడు.

ఆక్లాండ్‌లో అడుగుపెట్టిన టీమిండియా

ఆసీస్ గడ్డపై చారిత్రక సిరీస్‌లు గెలిచిన అనంతరం న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తలపడేందుకు భారత క్రికెట్‌ జట్టు ఆక్లాండ్‌లో అడుగుపెట్టింది. జనవరి 23న ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో టీమిండియా ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆక్లాండ్‌ విమానాశ్రయం నుంచి భారత ఆటగాళ్లు బయటకు వస్తున్న వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో ఉంచింది.

నేపియర్‌లో తొలి వన్డే

నేపియర్‌లో తొలి వన్డే

టీమిండియాకు అక్కడి అభిమానులు సాదరంగా స్వాగతం పలికారు. కేదార్‌ జాదవ్‌, దినేష్‌ కార్తీక్‌ ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపించగా.. విరాట్‌ కోహ్లీ, అనుష్కకు గట్టిగా అరిచి వెల్‌కమ్‌ చెప్పారు. బుధవారం నేపియర్‌లో జరిగే తొలి వన్డే కోసం భారత జట్టు సోమవారం బయల్దేరి వెళ్లనుంది. నేపియర్‌ వేదికగా తొలి వన్డే, మౌంట్‌ మౌంగనయ్‌లో రెండో, మూడో వన్డేలు, హామిల్టన్‌, వెల్లింగ్టన్‌లో చివరి రెండు వన్డేలు జరగనున్నాయి.

Story first published: Monday, January 21, 2019, 14:16 [IST]
Other articles published on Jan 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X