న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖపట్నం చేరుకున్న ధోని: చూసేందుకు ఎగబడ్డ అభిమానులు

India vs Australia 2019 : Dhoni Receives King-Like Welcome On Reaching Vizag | Oneindia Telugu
MS Dhoni Spotted at Visakhapatnam Airport

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ గురువారం విశాఖపట్నం చేరుకున్నాడు. విశాఖతో ధోనికి ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది. ధోని కెరీర్ మొదలైంది ఇక్కడే. విశాఖ వేదికగా ఫిబ్రవరి 24న ఆస్ట్రేలియాతో తొలి టీ20 జరగనున్న నేపథ్యంలో ధోని విశాఖలో మళ్లీ అడుగుపెట్టాడు. రాయ్‌పూర్‌ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ఎయిరిండియా విమానంలో విశాఖ వచ్చిన ధోనీకి విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు.

పుల్వామా ఉగ్రదాడి ఎపెక్ట్: భారత్-పాక్ మధ్య వరల్డ్ కప్ మ్యాచే చివరిదిపుల్వామా ఉగ్రదాడి ఎపెక్ట్: భారత్-పాక్ మధ్య వరల్డ్ కప్ మ్యాచే చివరిది

ధోనీ ధోనీ అంటూ నినాదాలు

ధోనీ ధోనీ అంటూ నినాదాలు

అనంతరం ధోనిని అభిమానులు కలిసి కరచాలనాలు చేశారు. ధోనీ ధోనీ అంటూ నినాదాలు చేశారు. కేరింతలు కొట్టారు. విశాఖలో ఫిబ్రవరి 24న భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఆ మ్యాచ్‌లో పాల్గొనేందుకు ధోనీ జట్టుతో పాటు కాకుండా ఒకరోజు ముందుగానే విశాఖపట్నానికి చేరుకున్నాడు.

శుక్రవారం నగరానికి రానున్న టీమిండియా, ఆసీస్ క్రికెటర్లు

శుక్రవారం నగరానికి రానున్న టీమిండియా, ఆసీస్ క్రికెటర్లు

మిగతా టీమిండియా సభ్యులు, ఆస్ట్రేలియా క్రికెటర్లు శుక్రవారం నగరానికి చేరుకోనున్నారు. విశాఖలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియం భారత్‌కు ఎంతో అచ్చొచ్చిన స్టేడియం. ఈ స్టేడియంలో టీమిండియా అనేక విజయాలను అందుకుంది. మూడేళ్ల క్రితం భారత పర్యటనలో శ్రీలంక జట్టు సిరీస్‌లో చివరిదైన మూడో టీ20 మ్యాచ్‌ను విశాఖలో ఆడింది.

టీమిండియాకు అచ్చొచ్చిన విశాఖ స్టేడియం

టీమిండియాకు అచ్చొచ్చిన విశాఖ స్టేడియం

ఈ మ్యాచ్‌కి ముందు ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో సిరిస్ సమం అయింది. విశాఖలో జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంతో పాటు సిరిస్‌ను కూడా కైవసం చేసుకుంది.

Story first published: Friday, February 22, 2019, 8:33 [IST]
Other articles published on Feb 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X