Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

' పిచ్‌పై ధోనీ అసహనం.. ఇలాంటి పిచ్‌లపై బ్యాటింగ్ చాలా కష్టం'

IPL 2019 : MS Dhoni Again Angry On Chennai Pitch || Oneindia Telugu
MS Dhoni slams Chennai pitch again, Dont want to play on wickets like these

చెన్నై పిచ్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు. ఇలాంటి పిచ్‌లు ఎవరికీ కావాలని పిచ్‌ క్యూరెటర్‌పై మండిపడ్డారు. మంగళవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నైసూపర్‌ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పిచ్ నెమ్మదిగా ఉండడంతో.. ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా ఆటగాళ్లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. విధ్వంసక ఆటగాడు ఆండ్రీ రసెల్‌ ఒక్కడే పోరాడి 50(44 బంతుల్లో; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధ సెంచరీ చేసాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని చెన్నై కస్టపడి ఛేదించింది. పిచ్ రెండవ ఇన్నింగ్స్ లో మరీ నెమ్మదించడంతో చెన్నై బ్యాట్స్‌మన్‌ పరుగుల చేయడానికి ఇబ్బంది పడ్డారు. డుప్లెసిస్ ఒంటరి పోరాటం చేసి చెన్నైని విజయతీరాలకు చేర్చాడు.

తొలి టెస్ట్ ఇక్కడే ఆడాను:

తొలి టెస్ట్ ఇక్కడే ఆడాను:

మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ... 'ఇక్కడి మైదానంతో నాకు విడదీయని అనుబంధం ఉంది. చెన్నై జట్టుకు మొదటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా తొలి టెస్ట్ ఇక్కడే ఆడాను. ఇక్కడి అభిమానులు చెన్నై జట్టును చాలా ఆదరిస్తున్నారు. మ్యాచ్‌లను విజయాలతో ముగించాలనే మేము ప్రయత్నం చేస్తున్నాం' అని ధోనీ తెలిపారు.

ఇలాంటి వికెట్‌పై ఎవరు ఆడుతారు:

ఇలాంటి వికెట్‌పై ఎవరు ఆడుతారు:

'ఇలాంటి పిచ్‌లపై ఆడాలని నేను అనుకోవట్లేదు. ఇలాంటి పిచ్‌లు ఎవరూ కోరుకోరు. వికెట్‌ నెమ్మదిస్తుంటే పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఇన్నింగ్స్ మొదటలో మరీ దారుణంగా ఉంది. కొద్దిగా మంచు వచ్చిన తర్వాత పర్వాలేదనిపించింది. ఈ పిచ్‌పై సమతూకమైన జట్టుతో దిగడం కూడా కష్టమే. ఇలాంటి వికెట్‌పై ఎవరు ఆడుతారని' ధోనీ మండిపడ్డాడు.

సీజన్ మొదటి మ్యాచ్‌లో కూడా:

సీజన్ మొదటి మ్యాచ్‌లో కూడా:

ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో కూడా క్యూరెటర్ ఇలాంటి పిచ్‌నే సిద్దం చేయడంతో.. మొదటగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 70 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్య చేధనకు దిగిన చెన్నై 18 ఓవర్లు ఆడి గెలుపొందింది. అప్పుడు కూడా ధోని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Story first published: Wednesday, April 10, 2019, 16:00 [IST]
Other articles published on Apr 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+