ధడక్ స్టార్ ఇషాన్ ఖట్టర్‌కు ధోని పుట్‌బాల్ పాఠాలు: ఫోటోలు వైరల్


హైదరాబాద్: ఇంగ్లాండ్‌లో పరిమిత ఓవర్ల సిరిస్ ముగియడంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. స్వతహాగా పుట్‌బాల్‌కు అభిమాని అయిన ధోని, భారత జట్టు ప్రాక్టీస్ చేసే సమయంలో అనేక సార్లు పుట్‌బాల్ ఆడుతుండటాన్ని అనేకసార్లు మనం చూశాం.
ధోని సహచర ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా, ధోని మరోసారి తన అనుభవాలను ఇతరులతో పంచుకుంటూ కనిపించాడు. అయితే, ఈ సారి ధోని క్రికెట్‌కు సంబంధించిన అనుభవాలను కాకుండా తనకు ఎంతో ఇష్టమైన ఫుట్‌బాల్ గురించి అనుభవాలను పంచుకున్నాడు.

ధోని నుంచి ఇషాన్ ఫుట్‌బాల్ పాఠాలు
ఇంతకీ ధోని నుంచి పాఠాలను నేర్చుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఇటీవలే విడుదలై బాలీవుడ్‌లో హిట్ టాక్ సొంతం చేసుకున్న ధడక్ స్టార్ ఇషాన్ ఖట్టర్. తాజాగా ధోని, ఇషాన్ ఖట్టర్‌లు ముంబైలో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. ఈ సమయంలో ధోని నుంచి ఇషాన్ ఫుట్‌బాల్ పాఠాలు నేర్చుకున్నాడు.

ధోనితో కలిసి పుట్‌బాల్ ఆడిన బాలీవుడ్ నటులు
ఈ పుట్‌బాల్ మ్యాచ్‌లో బాలీవుడ్‌కు చెందిన పులువురు టీవీ స్టార్లు కూడా ధోనితో కలిసి ఆడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో ఇషాన్ ఖట్టర్ పుట్‌బాల్‌కు సంబంధించిన కొన్ని టిప్స్ చెబుతుండటాన్ని మనం చూడొచ్చు.

బాలీవుడ్ స్టార్లు-క్రికెటర్ల మధ్య ఛారిటీ మ్యాచ్
ప్రతిఏటా బాలీవుడ్ స్టార్లు-క్రికెటర్ల మధ్య ఛారిటీ మ్యాచ్ నిర్వహించి, తద్వారా వచ్చే మొత్తాన్ని ఛారిటీకి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ ప్రాక్టీస్ చేసినట్లుగా తెలుస్తోంది. క్రికెటర్లు ప్రాతనిథ్యం వహించే జట్టు పేరు ఆల్ హార్ట్స్ ఎఫ్‌సీ కాగా, బాలీవుడ్ తారలు ప్రాతినిథ్యం వహించే జట్టు పేరు ఆల్ స్టార్స్ ఎఫ్‌సీ.

కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడుపుతున్న ధోని
గతేడాది ఆల్ స్టార్స్ ఎఫ్‌సీ జట్టుకు అభిషేక్ బచ్చన్ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని తిరిగి భారత్ చేరుకున్న ధోని ప్రస్తుతం కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడుపుతున్నాడు. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ కుమార్తె పెళ్లి వేడుకకు ధోని కుటుంబసభ్యులతో హాజరయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications