
హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అప్పుడే భారత జట్టు సీనియర్ బ్యాట్స్‌మెన్ ఎంఎస్ ధోనీ రిటైర్‌మెంట్ గురించి తాజాగా స్పందించాడు. అప్పుడే ధోనీ రిటైర్ అవ్వడం మంచిది కాదంటూ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా జట్టుతో రెండో టెస్టులో క్రీడాకారుల ఆటతీరుపై నిరుత్సాహం వ్యక్తం చేసిన గవాస్కర్ ఇలా వ్యాఖ్యానించాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండో టెస్టులో భారత్ హోరాహోరీగా తలపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఆటతీరుపై అసహనం వ్యక్తం చేశాడు. భారత జట్టుకు పదకొండో ఆటగాడిగా పార్థివ్ పటేల్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి వరకు టెస్ట్ మ్యాచ్‌ల్లో వికెట్ కీపర్‌గా కొనసాగుతున్న వృద్ధిమాన్ సాహా కాలికి గాయంతో తప్పుకోవడంతో పార్థివ్ పటేల్ తెరపైకి వచ్చాడు.
36 సంవత్సరాల ఎంఎస్ ధోనీ భారత జట్టుతో పాటు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నా టెస్ట్ మ్యాచ్‌లకు మాత్రం ఆడట్లేదు. కారణం 2014లో మెల్‌బౌర్న్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో మ్యాచ్ ఆడిన అనంతరం తను టెస్ట్ మ్యాచ్‌లు ఆడనంటూ విరామాన్ని ప్రకటించాడు. అంతకుముందు వరకు 90 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ధోనీ ఓ చరితను సృష్టించాడు. 256 క్యాచ్‌లు, 38 స్టంప్‌లు, 4876 పరుగులను సొంతం చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే సాహా, పార్థివ్ పటేల్‌లు బ్యాటింగ్‌లో పరవాలేదనిపించుకున్న కీపింగ్‌లో మాత్రం పార్థివ్ రాణించలేకపోతున్నాడని భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత కామెంటేటర్ అయిన సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఈ సమయంలో ధోనీ పూర్తిగా రిటైర్‌మెంట్ తీసుకుంటే జట్టులో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందంటూ అభిప్రాయపడ్డాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.