ధోనీకి ఏమంత వయసైందని? ఇంకో రెండేళ్లు ఆడగలడు: శ‌్రీలంక స్పీడ్‌స్టర్ మలింగ

లండన్: భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రపంచకప్ టోర్నమెంట్ ముగిసిన వెంటనే క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటిస్తారంటూ వస్తోన్న వార్తలపై శ్రీలంక బౌలింగ్ తురుఫుముక్క, స్పీడ్‌స్టర్ లసిత్ మలింగ ప్రతికూలంగా స్పందించారు. ఇప్పుడిప్పుడే ధోనీకి క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ధోనీ.. ఇంకో ఏడాది లేదా రెండేళ్ల పాటు అవలీలగా క్రికెట్ ఆడగలడని మలింత అభిప్రాయపడ్డారు. మరో రెండేళ్ల పాటు ఆడగల సత్తా ధోనీకి ఉందని చెప్పారు.

ధోనీ అవసరం జట్టుకు అవసరం..
భారత క్రికెట్ జట్టులో ధోనీ వంటి అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ కొనసాగాల్సిన అవసరం చాలా ఉందని లసిత్ మలింగ అన్నారు. టీమిండియాలో ప్రస్తుతం ధోనీ స్థాయిలో క్రికెట్‌ను ఆడిన అనుభవం ఎవరకీ లేదని, జట్టులో యువరక్తం నిండి ఉందని చెప్పారు. టీమిండియాలో చోటు సంపాదించుకున్న యంగ్ క్రికెటర్లకు ధోనీ నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచించారు. రోహిత్‌శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లు మాత్రమే అత్యధికంగా వన్డేలు లేదా టెస్ట్‌మ్యాచ్‌లను ఆడిన అనుభవం ఉందని చెప్పుకొచ్చారు. టెస్ట్ మ్యాచ్‌ల నుంచి ఇదివరకే వైదొలగిన ధోనీ.. వన్డేల్లో కొనసాగాల్సిన అవసరం టీమిండియాకు ఎంతైన ఉందని అన్నారు. ఒత్తిడిని తట్టుకుని ఇన్నింగ్‌ను పునర్నిర్మించగల సామర్థ్యం ధోనీ ఉందని చెప్పారు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటికీ ధోనీ ఒక్కడే అత్యత్తుమ ఫినిషర్ అని మలింగ ప్రశంసించారు. ధోనీ వీడ్కోలు చెబితే.. ఆయన లేని లోటును భర్తీ చేయడం సాధ్యంకాదని అన్నారు.

బుమ్రా.. బెస్ట్
టీమిండియా బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రాకు అత్యుత్తమ సాంకేతిక సామర్థ్యాలు ఉన్నాయని మలింగ అన్నారు. 2013 నుంచీ తాను బుమ్రాను, అతని శైలిని గమనిస్తున్నానని, నేర్చుకోవాలనే తపన అతనిలో ఉందని చెప్పారు. దేన్నయినా తొందరగా నేర్చుకుంటాడని మలింగ అన్నారు. బుమ్రా ఓ క్విక్ లెర్నర్ అని, అదే అతనికి అండగా నిలుస్తోందని చెప్పారు. ఎప్పటికప్పుడు బుమ్రా తన బౌలింగ్‌ను మెరుగుపరచుకుంటున్నాడని చెప్పారు. అతి తక్కువ కాలంలో ప్రపంచ క్రికెట్‌లో తానేమిటో నిరూపించుకున్నాడని అన్నారు.

ప్రపంచకప్ టీమిండియాదే..
ఈ సారి కూడా ప్రపంచకప్‌ను టీమిండియా ఎగరేసుకెళ్తుందని మలింగ జోస్యం చెప్పారు. 2011 ప్రపంచ కప్ టోర్నమెంట్‌ను భారత క్రికెట్ జట్టు పునరావృతం చేస్తుందని చెప్పారు. రోహిత్ శర్మ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో మనం చూస్తున్నామని, అదే ఫామ్‌ను అతను మిగిలిన మ్యచ్‌లల్లో కూడా కొనసాగిస్తాడని చెప్పారు. విరాట్ కోహ్లీ కూడా బాగా ఆడుతున్నాడని, అతను సెమీ ఫైనల్ లేదా ఫైనల్ లో మరో సెంచరీ సాధిస్తాడని మలింగ అన్నారు.. మ్యాచ్ ను ఒంటి చేతి మీద గెలిపించగలిగే ఆటగాళ్లు ఇండియాకు చాలా మంది ఉన్నారని, అదే పనికి వస్తోందని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications