న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీ ఆటను కొనసాగిస్తాడా?.. లేకపోతే గౌరవమైన వీడ్కోలు ఇవ్వాలి'

MS Dhoni should be playing more often if he is in scheme of things for T20 World Cup 2020 says Anil Kumble

ముంబై: వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ వరకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన ఆటను కొనసాగిస్తాడో లేదో సీనియర్ సెలక్షన్ కమిటీ తెలుసుకోవాలని భారత మాజీ కెప్టెన్, లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే సూచించారు. ఒకవేళ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగకుంటే అతనికి గౌరవమైన వీడ్కోలు ఇవ్వాలని కుంబ్లే పేర్కొన్నారు.

<strong>వికాస్‌ ఖండోలా సూపర్‌-10.. టేబుల్ టాపర్ ఢిల్లీకి హర్యానా షాక్!!</strong>వికాస్‌ ఖండోలా సూపర్‌-10.. టేబుల్ టాపర్ ఢిల్లీకి హర్యానా షాక్!!

పంత్‌ ప్రదర్శన బాగాలేదు:

పంత్‌ ప్రదర్శన బాగాలేదు:

తాజాగా ధోనీ రిటైర్మెంట్‌పై అనిల్‌ కుంబ్లే స్పందించారు. కుంబ్లే మాట్లాడుతూ... 'నేను కచ్చితంగా చెప్పలేను. కానీ.. వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా రిషభ్‌ పంత్‌ ఉండాలని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా టీ20ల్లో. అయితే పంత్‌ ప్రదర్శన మాత్రం ఏమంత బాగాలేదు. అతనికి నిలకడ లేదు. ఈ నేపథ్యంలో కొత్తవారికి పిలుపునిస్తారా లేదా పాత ఆటగాళ్లకే అవకాశమిస్తారా అనే విషయాన్ని సెలక్టర్లు నిర్ణయించుకోవాలి' అని కుంబ్లే అన్నారు.

 ధోనితో చర్చించాలి:

ధోనితో చర్చించాలి:

'టీ20 ప్రపంచకప్‌ వరకు ధోనీ ఉండాలని భావిస్తే.. అతడిని ఎక్కువ మ్యాచ్‌లు ఆడించాలి. ఏ విషయమైనా ధోనితో వారు చర్చించాలి. ఒకవేళ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగకుంటే అతనికి గౌరవమైన, సముచితమైన వీడ్కోలు ఇవ్వాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సెలక్టర్లు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఏదేమైనా రాబోయే రెండు నెలల్లో కీలక నిర్ణయం తీసుకోవాలి' అని కుంబ్లే సూచించారు.

రోహిత్‌ను టాప్‌ఆర్డర్‌లో పంపించాలి:

రోహిత్‌ను టాప్‌ఆర్డర్‌లో పంపించాలి:

'టెస్టుల్లో రోహిత్‌ శర్మ బెస్ట్ ఓపెనర్ ఆప్షన్. అతడు బాగా రాణించగలడు. దేశీయ స్థాయిలో బాగా రాణించిన వారిలో ఓపెనర్ కోసం వెతుకుతున్న పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి సమయంలో మంచి నైపుణ్యం ఉన్న రోహిత్‌ను బెంచ్‌కే పరిమితం చేయకుండా టాప్‌ఆర్డర్‌లో పంపించాలి. రవిచంద్రన్‌ అశ్విన్‌కు కూడా అవకాశం ఇవ్వాలి. ఇప్పటికీ అశ్విన్ అగ్రశ్రేణి స్పిన్నర్‌. అతడిని తుది జట్టులోకి తీసుకోవాలి' అని కుంబ్లే పేర్కొన్నారు.

Story first published: Sunday, September 8, 2019, 12:43 [IST]
Other articles published on Sep 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X