Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోని సంచలన నిర్ణయంతో ఆశ్చర్యం: ట్విట్టర్‌లో ఎవరేమన్నారు?

హైదరాబాద్: భారత జట్టుకు అత్యధిక విజయాలనందించిన కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్‌గా టీమిండియాను పదేళ్ల పాటు నడిపించిన ధోని పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. అయితే ధోని నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేసింది.

అయితే జనవరి 15 నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్‌కు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ధోని సమాచారం అందించాడని బీసీసీఐ ట్వీట్ చేసింది. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని ధోని చెప్పినట్టు బీసీసీఐ ట్విట్టర్‌లో తెలిపింది. దీంతో ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్‌కు ధోని వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌గా అందుబాటులో ఉంటాడు.

కెప్టెన్సీకి ధోని గుడ్ బై చెప్పడంతో కోహ్లీనే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్సీ వహించనున్నాడు. ధోని హయాంలో టీమిండియా అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. వన్డే ప్రపంచ కప్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీ.. టీ20 ప్రపంచ కప్‌లు ఇలా మూడూ సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్రలో నిలిచిపోయాడు.

మూడు ఫార్మాట్లలో 50కి పైగా మ్యాచ్‌ల్లో జట్టుకు నాయకత్వం వహించిన ఒకే ఒక్క కెప్టెన్‌ ధోని మాత్రమే. ఈనెల 15 నుంచి ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌తో పాటు మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సమయంలో ధోని కెప్టెన్సీకి గుడ్ బై చెబుతూ తీసుకున్న నిర్ణయం అటు క్రికెటర్లతో పాటు అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.

ధోని సంచలన నిర్ణయంపై ట్విట్టర్‌లో ఎవరేమన్నారో ఒక్కసారి చూద్దాం:

ధోని కెప్టెన్సీపై బీసీసీఐ ట్వీట్

జనవరి 15 నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్‌కు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ధోని సమాచారం అందించాడని బీసీసీఐ ట్వీట్ చేసింది.

కెప్టెన్సీకి ధోని గుడ్ బై: ఐసీసీ ట్వీట్

కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్‌గా టీమిండియాను పదేళ్ల పాటు నడిపించిన ధోని పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ధోని నిర్ణయంపై ఐసీసీ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.

అనురాగ్ ఠాకూర్

టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలు భారత్‌కు అందించిన గొప్ప కెప్టెన్ ధోనీ. అతని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.

మహ్మద్ కైఫ్ స్పందన

9 ఏళ్ల పాటు కెప్టెన్‌‌గా టీమిండియాకు అద్భుతమైన విజయాలను అందించాడని మహ్మద్ కైఫ్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

హర్షా బోగ్లే

వన్డే ప్రపంచ కప్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీ.. టీ20 ప్రపంచ కప్‌, ఛాంపియన్స్ టైటిల్‌లు ఇలా మూడూ సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్రలో నిలిచిపోయాడు.

రమేష్ బాలా

థ్యాంక్యూ ధోని. కెప్టెన్‌గా టీమిండియాకు అద్భుతమైన సేవలనందించావు. కెప్టెన్లు వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం లెజెండరీ లీడర్

మోహన్ దాస్ మీనన్

భారత జట్టుకు అత్యధిక విజయాలనందించిన కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని వెలుగొందాడు. కెప్టెన్‌గా టీమిండియాను పదేళ్ల పాటు నడిపించిన ధోని పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్

కెప్టెన్‌గా టీమిండియాను పదేళ్ల పాటు నడిపించిన ధోని పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ధోని నిర్ణయంపై బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇలా స్పందించాడు.

క్రికెట్ వాలా

ధోని అవసరం జట్టుకు ఉంది. ఇంకా జట్టులో కొనసాగాలని కోరుకుంటున్నా. జనవరి 15 నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్‌కు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ధోని సమాచారం అందించాడని బీసీసీఐ ట్వీట్ చేసింది. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని ధోని చెప్పినట్టు బీసీసీఐ ట్విట్టర్‌లో తెలిపింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+